Breaking News

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం

Published on Thu, 06/04/2026 - 16:45

అమరావతి: ఎండలతో ఠారెక్కిపోతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వరుణుడు ఒక్కసారిగా ఉపశమనం కల్పించారు. ఎండలతో మండిపోతున్న వాతావరణం ఒక్కసారిగా వర్షం కురిసింది. విజయవాడలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది.  దీంతో రోడ్లపైకి నీరు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు తెలంగాణలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, కరీంనగర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపైకి నీరు చేరింది. అదేవిధంగా పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మండలాల్లో మోస్తారుగా వానలు కురిశాయి. ఎండల తీవ్రతతో తల్లడిల్లిపోయిన ప్రజలకు ఈ వర్షాలు కొంతమేర ఉపశమనం కల్పించాయి.

అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు సైతం మండిపోయాయి. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో44.7 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 43.8,  బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.7, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.6, కృష్ణా జిల్లా కంకిపాడులో 43.4, ప్రకాశం జిల్లా కొండపిలో 43, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, నెల్లూరు జిల్లా గూడూరులో 44 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడి, పల్నాడు జిల్లా అమరావతిలో 43.4, కంచికచర్లలో 43.2, గుంటూరు జిల్లా రాయపూడిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

 

Weather Updates: వచ్చేసిన రుతుపవనాలు.. ఇక వానలే.. వానలు

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)