Breaking News

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్‌ జామ్

Published on Tue, 06/09/2026 - 16:52

సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల కుండపోతగా వాన కురిసింది. నగర పరిధిలోని అడిక్‌మెట్‌, విద్యానగర్‌, అంబర్‌ పేట్‌, ఉస్మానియా యూనివర్శిటీ, హఫీజ్‌పేట్‌, నాచారం, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మల్కాజిగిరి, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.  దీంతో పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేసే యత్నం చేస్తున్నారు. 

జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించిన దక్షిణ–పశ్చిమ రుతుపవనాలు రాకతో, మంగళవారం(జూన్‌ 9వ తేదీ) సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. తద‍్వారా రహదారులు నీట మునగడంతో పాటు విద్యుత్‌ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. రాత్రి కూడా వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్..
నగర ఐటీ కారిడార్‌లో కురిసిన కుండపోత వర్షానికి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  రాయదుర్గం, ఐకియా, మైండ్‌స్పేస్ పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో గమ్యస్థానాలకు చేరుకునే ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షం.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. 

అంబర్‌పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు
అంబర్‌పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు చేరింది.  హైడ్రా చేసిన ఏర్పాట్లతో పరిసర బస్తీలకు  వరద ముప్పు తప్పింది. చెరువు నిండటంతో స్థానిక ప్రజల హర్షం వ్యక్తం చేశారు. 

ఇద్దరు యువకుల మృతి
హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. బండ్లగూడ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆటో దిగగానే విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను జాఫర్ (25), అబూ (16)గా గుర్తించారు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వర్షపాతం రికార్డు వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయి..

అడిక్‌మెట్‌-36.3 mm

విద్యానగర్‌- 31.5 mm

అంబర్‌ పేట్‌-31.3 mm

ఉస్మానియా యూనివర్శిటీ-హఫీజ్‌పేట్‌-27.5 mm

నెహ్రూ నగర్‌-21 mm

మలక్‌పేట్‌-మియాపూర్‌-18 mm

ఉప్పల్‌-సరూర్‌నగర్‌- 12 mm

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)