Breaking News

హైదరాబాద్‌లో కుండపోత.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Published on Sat, 10/25/2025 - 15:14

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌నగర్‌, మోహిదీపట్నం, అత్తాపూర్‌, ఆరాంఘర్‌, కూకట్‌పల్లి, మూసాపేట్‌, బాలానగర్‌లో కుండపోతగా వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది.

పలు ప్రధాన రహదారులన్నీ జలమయమై.. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు భారీగా చేరడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

 

కాగా, ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఐఎండీ.. అత్యంత అప్రమత్తత ప్రకటించింది. 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 27న భారీ వర్షాలు పడే అవకాశముందని.. బాపట్ల, ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

నంద్యాల, చిత్తూరు, పల్నాడు, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఈ నెల 28న కాకినాడ సమీపంలో మెంథా తీవ్ర తుఫాన్. తీరం దాటనుంది. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, గుంటూరు, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)