Breaking News

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం

Published on Thu, 05/16/2024 - 15:27

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. పలు చోట్ల వర్షం కురిసింది. మూసాపేట, కూకట్‌పల్లి, మియాపూర్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చంపాపేట్‌  బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మెహిదీపట్నం, టోలిచౌక్‌, గచ్చిబౌలి, చార్మినార్‌, మలక్‌పేట్‌, నాగోల్ కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మలక్‌పేట్‌ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపునీరు చేరింది. రైల్వే అండర్‌ పాస్‌ కింద వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోఠి, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్తే రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో రాత్రిలోగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఐఎండీ సూచించింది.

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు గంటల్లో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం, నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణం పేర్కొంది.

రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మంచిర్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్‌నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో ,  ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు  వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)