Breaking News

పోలీసు పహారాలో గ్లోబల్ సమ్మిట్

Published on Tue, 12/09/2025 - 23:08

భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు భారీ పోలీసు వహారా ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్‌కు విదేశీ ప్రముఖులతో పాటు అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్న సందర్భంగా ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అడుగడుగునా పోలీసు పహారాను ఏర్పాటు చేశారు.

దీనికి గాను కింది స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయి అధికారుల వరకు బందోబస్తు మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతిఒక్క అధికారి ఈ సమ్మిట్‌కలో ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా సమ్మిట్‌లోనే పోలీస్ కమాండ్ కంట్రోల్‌ను ఎస్టాబ్లిష్ చేసి వెయ్యికి పైగా సీసీ కెమెరాల ద్వారా ప్రతి సెకను కదలికలను గమనిస్తున్నారు.

శంషాబాద్ విమానాశ్రయం టూ ఫ్యూచర్ సిటీ
ఈ అంతర్జాతీయ సమ్మిట్ కోసం పోలీసు శాఖ నెల రోజుల నుంచి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తూ ఫ్యూచర్ సిటీలోనే మకాం వేసి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ బందోబస్తు ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి సహా సీనియర్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. నిన్నటి రోజు సదస్సులో అనేక మంది ప్రముఖులు పాల్గొనగా వీరిలో పలువురు శంషాబాద్ విమానాశ్రయంలో దిగి ఫ్యూచర్ సిటీకి రోడ్డు మార్గాన వచ్చారు. అలా వచ్చిన ప్రతినిధులు, ప్రముఖుల కోసం రహదారి వెంట వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు బాంబు స్వార్డ్, డాగ్ స్క్వాడ్ బృందం నిరంతరం తనిఖీలు నిర్వహించారు.

ఆకట్టుకున్న పోలీసు స్టాల్
సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన పోలీసు స్టాల్ విదేశీయులను తదితరులను ఆకట్టుకున్నది. తెలంగాణ పోలీసు శాఖ తరపున సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మహిళా భద్రతా విభాగం సాధించిన విజయాలను వారికి అర్థమయ్యే విధంగా వారి భాషలోనే వివరిస్తూ కరపత్రాలను పంచారు. ఆంగ్లంలోవున్న ఈ కరపత్రాలు అందరికీ ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ సాధించిన విజయాలను కూడా వారు వివరించారు. అలాగే సమ్మిట్ ప్రాంతంలో రోడ్డు మార్గంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు  కలియతిరిగుతూ వాహనాల తనిఖీ నిర్వహించి హెల్మెట్ లేనివారికి  అవగాహన కల్పించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)