కృష్ణమ్మ ఉగ్రరూపం

Published on Sun, 08/17/2025 - 05:13

దోమలపెంట/నాగార్జునసాగర్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ఆనకట్ట వద్ద శనివారం ఐదు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్‌ వే ద్వారా 41,112 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 38,879 క్యూసెక్కులు, సుంకేçశుల నుంచి 30,653 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,10,644 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి వస్తోంది. దీంతో 5 గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేరకు ఎత్తి 1,33,720 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 30,509 క్యూసెక్కులు కలిపి 65,824 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.1 అడుగుల నీటిమట్టం వద్ద 199.7354 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల్లో పోతిరెడ్డిపాడు ద్వారా 25,333, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా 2,426 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

ఎడమగట్టు కేంద్రంలో 16.956 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.357 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు. పై నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్‌ 20 గేట్లు ఎత్తి 1,56,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 29,516 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ జలాశ యం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు). ప్రస్తుత నీటిమట్టం 587.40 అడుగులు(305.7464టీఎంసీలు) ఉంది.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)