Breaking News

'పవర్' ప్రకంపనలు

Published on Tue, 07/30/2024 - 00:48

సాక్షి, హైదరాబాద్‌: ‘విద్యుత్‌’ పద్దుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ ప్రకంపనలు రేపింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, సవాళ్లు– ప్రతిసవాళ్లు, ఆరోపణలు– ప్రత్యారోపణలు, రాజీనామా డిమాండ్లతో సభ అట్టుడికింది. అదే సమయంలో ఇరుపక్షాల నేతల మధ్య వ్యక్తిగత దూషణలూ చోటుచేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. 

ఈ ఏడాది విద్యుత్‌ రంగానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై సోమవారం శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే విద్యుత్‌ రంగం నష్టాల్లోకి వెళ్లిందని ఆక్షేపించారు. విద్యుత్‌ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, ఆ కథంతా వెలికి తీస్తామని పేర్కొన్నారు. 

అనంతరం బీఆర్‌ఎస్‌ సభ్యుడు జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని పెంచామంటూ పలు గణాంకాలను వివరించారు. అవినీతి అంటూ కాంగ్రెస్‌ సర్కారు కక్షపూరితంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఈ దశలో సీఎం రేవంత్‌ జోక్యం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలోని విద్యుత్‌ ఒప్పందాలన్నీ అవినీతిమయమంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా జగదీశ్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిగా సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈ సమయంలో ఇరుపక్షాల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో శాసనసభ దద్దరిల్లింది. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)