Breaking News

స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలివ్వలేవు

Published on Tue, 07/09/2024 - 02:43

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయలేవని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫిర్యాదులపై నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగం స్పీకర్‌కు కల్పించిందన్నారు. రిట్‌ పిటిషన్లు దాఖలు చేయడంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలది తొందరపాటు చర్య అని పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. 

కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావును అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన కడియం, తెల్లం ఆ తర్వాత తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని పిటిషనర్‌ కోర్టు దష్టికి తెచ్చారు. అందుకే వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. స్పీకర్‌ను కలవాలని ప్రయతి్నంచినా సమయం ఇవ్వట్లేదని.. ఈ–మెయిల్‌ ద్వారా పంపిన పిటిషన్‌పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకొనేలా స్పీకర్‌ను ఆదేశించాలని వివేకానంద విజ్ఞప్తి చేశారు.

ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సైతం తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని.. ఆయన్ను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్‌ వేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. దీనిపై ఏజీ వాదిస్తూ పిటిషన్లు సమరి్పంచిన వెంటనే స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకోవట్లేదని పిటిషనర్లు పేర్కొనడం సరికాదన్నారు.

ఫిర్యాదు చేసిన 10 రోజుల్లోనే త్వరగా నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. ఈ సందర్భంగా తన వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టులు స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వలేవంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను వివరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు