అట్టుడికిన హెచ్‌సీయూ

Published on Wed, 04/02/2025 - 06:04

గచ్చిబౌలి: కంచ గచ్చిబౌలి భూముల వేలానికి నిరసనగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూ నివర్సిటీ వద్ద ధర్నాకు వచ్చిన సీపీఎం, బీజేవైఎం కార్యకర్తల ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హెచ్‌సీయూ ప్రధాన ద్వారం బయట నిరసనకా రులు.. వర్సిటీ లోపల విద్యార్థుల ధర్నాతో హెచ్‌సీ యూ అట్టుడికిపోయింది. మంగళవారం హెచ్‌సీయూ విద్యా ర్థులు మహాధర్నాకు పిలుపు ఇవ్వడం, వర్సిటీ భూములను పరిశీలిస్తామని బీజేపీ ఎమ్మెల్యే లు చెప్పిన విషయం తెలిసిందే.

ఉదయం 11 గంటల సమయంలో అటు సీపీఎం, ఇటు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్, వర్సిటీ భూములను వేలం వేయొద్దని, విద్యార్థులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని నినదించారు. అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిని అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దొరికినవారిని దొరికినట్టే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహిళా నాయకురాళ్లను అరెస్ట్‌ చేశారు. నాలుగైదు వాహనాల్లో నిరసన కారులను నార్సింగి, కొల్లూరు, మాదాపూర్, రాజేంద్రనగర్, రాయదుర్గం పీఎస్‌లకు తరలించారు. దాదాపు 68 మందిని అరెస్టు చేసి, వారిపై కేసులు నమోదు చేసి రాత్రి విడుదల చేసినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులు మహాధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తుగా హౌస్‌ అరెస్టులు చేశారు. ఆందోళనకు నాయక త్వం వహించిన వారిలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్, సీపీఎం నేత శోభన్, ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎస్‌యూ అధ్యక్షుడు ఆవుల నాగరాజు తదితరులు ఉన్నారు. ఆందోళనల నేపథ్యంలో మాదాపూర్‌ డీసీపీ డాక్టర్‌ వినీత్‌ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

⇒ఆందోళన సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్‌ మాట్లాడుతూ వర్సిటీ భూములను కాపాడేందుకు ఎన్ని ఉద్యమాలైనా చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. భూముల వేలాన్ని తక్షణమే సీఎం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
⇒ విద్యార్థులపై పోలీసుల ఉక్కుపాదాన్ని నిరసిస్తూ ధర్నాకు వెళితే ఈడ్చుకెళ్లి అరెస్ట్‌ చేశారని సీపీఎం నాయకులు వాపోయారు. హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)