Breaking News

‘సుప్రీం’ తీర్పుతో తెలంగాణకు నష్టం

Published on Fri, 01/31/2025 - 00:58

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ సీట్ల రిజర్వేషన్లలో 50 శాతం స్థానిక కోటా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తీర్పుతో మెడికల్‌ కాలేజీల ఏర్పాటులో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో స్థానిక విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను చదివే అవకాశం కోల్పోతారని తెలిపారు. 

సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని సూచించారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ చొరవతో జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో వాటి సంఖ్య 34కు చేరింది. 

ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌ సీట్లతో పాటు పీజీ సీట్లలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 2,924 పీజీ మెడికల్‌ సీట్లలో 50 శాతం స్థానిక రిజర్వేషన్‌ కింద 1,462 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని సీట్లు ఆల్‌ ఇండియా కోటాలోకి వెళ్తాయి. 

తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు గడిచిన 77 ఏండ్లుగా ప్రత్యేక దృష్టి సారించి వైద్య విద్యను ప్రోత్సహించాయి’అని హరీశ్‌రావు తెలిపారు. 

రిజర్వేషన్లు కూడా దెబ్బతినే ప్రమాదం 
సుప్రీంతీర్పు రిజర్వేషన్లను కూడా ప్రభావితం చేస్తుందని హరీశ్‌రావు అన్నారు. ‘ఈ తీర్పుతో రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బతి నే ప్రమాదం ఉంది. పీజీలో ఇన్‌సర్వీస్‌ కోటా ప్రశ్నార్థకంగా మారి, గ్రామీణ ప్రాం తాల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది. వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. పీజీ విద్యార్థులకు స్టైఫెండ్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 

ఈ తీర్పుతో నష్టం జరుగుతుందని భావించిన తమిళనాడు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూ డా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లి స్టే తీసుకురావాలి. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలి’అని హరీశ్‌ సూచించారు.  

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)