Breaking News

పేదలను కొట్టి పెద్దలకు భూములు

Published on Fri, 06/06/2025 - 01:30

సాక్షి, హైదరాబాద్‌: బీద రైతుల కడుపుకొట్టి వారి భూములను బడా పారిశ్రామికవేత్తలకు కారు చౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ భూములను బలవంతంగా సేకరించే బాధ్యతను సీఎం భుజాన వేసుకున్నారని ఆరోపించారు. దీంతో రైతులపై తరచూ ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. 

జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి చెందిన బౌన్సర్లు, పోలీసులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమని ‘ఎక్స్‌’లో గురువారం పోస్టు పెట్టారు. పాలమూరు బిడ్డనని పదేపదే చెప్పుకునే సీఎం.. తన సొంత జిల్లాలో ఘటన జరిగినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు పెద్ద ధన్వాడతోపాటు మొత్తం 12 గ్రామాల రైతులపై దాడి చేసి, 40 మందిపై కేసులు నమోదుచేశారని, 12 మందిని రిమాండ్‌కు పంపారని తెలిపారు. 

రైతులపై దాడి చేయించిన ఇథనాల్‌ ఫ్యాక్టరీ యజమాని, బౌన్సర్లపై కేసులు ఎందుకు పెట్టలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పెద్ద ధన్వాడ తరహా ఘటనలు ఏడాదిగా రాష్ట్రంలో అనేకచోట్ల జరుగుతున్నాయని విమర్శించారు. పెద్ద ధన్వాడ ఘటనలో అరెస్టు చేసిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం హరితహారం
మాజీ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతోనే తెలంగాణలో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని హరీశ్‌రావు అన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)