Breaking News

సర్కారు బరితెగింపు

Published on Fri, 04/11/2025 - 06:02

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో వేలాది చెట్లను నరికి, జింకలను చంపి జీవ వైవిధ్యా న్ని విధ్వంసం చేస్తున్న తీరు ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభు త్వం బరితెగింపు వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వందల ఎకరాల్లో చెట్ల నరికివేతకు బాధ్యులైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర సాధికార కమిటీ చైర్‌పర్సన్‌ సిద్దాంత్‌దాస్, సభ్యులు చంద్రప్రకాశ్‌ గోయల్‌ను హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ బృందం గురువారం కలిసింది. పర్యావరణ విధ్వంసంపై వినతిపత్రం సమర్పించింది. అనంతరం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, దేవీ ప్రసాద్‌తో కలిసి హరీశ్‌రావు మీడి యాతో మాట్లాడారు.

రేవంత్‌ మూడు జింకల చావుకు కారణమయ్యారు.. 
‘హెచ్‌సీయూ భూముల్లో ఏడు చట్టాలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉల్లంఘించింది. వరుస సెలవు దినాలను అడ్డుపెట్టుకుని నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేసిన తీరును 11 పేజీల వినతిపత్రంలో వివరించడంతోపాటు 200 పత్రాలను కమిటీకి అందజేశాం. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు టీజీఐఐసీ పోలీసు విభాగానికి తప్ప ఏ ఒక్క ప్రభుత్వ శాఖకూ దరఖాస్తు చేయలేదు. పోలీసుల రక్షణలో జరిగిన విధ్వంసంతో మూడు జింకలు చనిపోగా, అనేక జంతువులు ఆవాసం కోల్పోయాయి. గతంలో జింకను వేటాడిన కేసులో సినీ నటుడు సల్మాన్‌ ఖాన్‌ జైలుకు వెళ్లాడు. మరి మూడు జింకల చావుకు కారణమైన రేవంత్‌పై ఏ తరహా చర్యలు తీసుకోవాలి’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

సుప్రీం తీర్పులను ఉల్లంఘించడమే
‘అటవీ స్వభావం కలిగిన భూముల వివరాలు ఇవ్వాలని ఓ వైపు సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను కోరుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ భూ ములను తెగనమ్మే ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పట్ల కూడా రేవంత్‌కు భయం లేకుండా పోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా కంచ గచ్చిబౌలి భూములు టీజీఐఐసీకి చెందినవే అని బోర్డులు పె ట్టారు. గతంలో కొత్త సచివాలయం నిర్మాణ సమయంలో గ్రీన్‌ ట్రిబ్యున ల్‌లో ఫిర్యాదు చేసి ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు వేసిన రేవంత్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పాలి. పర్యావరణ విధ్వంసాన్ని ప్రశ్నించిన విద్యార్థులను పది రోజులుగా జైల్లో పెట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.169.84 కోట్లు బ్రోకర్‌కు చెల్లించింది’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)