Breaking News

రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో ఇలా చేస్తున్నారు: హరీశ్‌ రావు

Published on Sun, 07/19/2026 - 16:26

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయట్లేరని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో హరీశ్‌ రావు మాట్లాడుతూ... కేసీఆర్ తిట్టడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని చెప్పారు.

‘‘ఈ కరవు కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. కేసీఆర్‌ను తిడితే నీళ‍్లు వస్తాయా? నీళ్లు ఎత్తి పోస్తే నీళ‍్లు వస్తాయా? మోటార్లు ఆన్ చేస్తే నీళ్ఉల వస్తాయి అని రిటైర్డ్ ఇంజినీర్లు  చెబితే బెల్టుతో కొడతా అని అంటారు రేవంత్. నువ్వు ముఖ్యమంత్రివా.. హిట్లార్‌వా?

కాళేశ్వరం కూలింది అని అంటున్నారు..పోయిన సారీ నీళ్లు వచ్చాయా లేదా? 70 టీఎంసీల నీళ్లు ఎత్తకుండా కిందికి వదిలేశారు. రేవంత్ రెడ్డి వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలి. రేవంత్ వచ్చాక రాష్ట్రం అంత కరవే. మనకు కరవు.. కాంగ్రెస్ వాళ్లు మాత్రం బాగా దొడ్డు అవుతున్నారు. 

రేవంత్ నువ్వు నీళ్లు ఎత్తి రంగనాయక, మల్లన్న, కొండపోచ్చమ్మకు కోపం వస్తే మాడి మసి అయితవు. బీఆర్ఏస్ హయాంలో బోర్ బండ్లు లేవు.. కాంగ్రెస్ హయంలో మళ్లీ బోర్ బండ్లు ఊర్లలోకి వస్తున్నాయి. అనాడు కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడుగా ఉంటే...ఇప్పుడు రేవంత్ రాక్షసుడిలా ఉన్నారు.

ఈ స్కాంల ప్రభుత్వం పోవాలి..స్కీమ్ ల ప్రభుత్వం బీఆర్ఏస్ రావాలి అని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలో పెద్దావగు కొట్టుకుపోయింది..  వట్టేం మునిగిపోయింది..సుంకిశాల కూలిపోయింది’’ అని చెప్పారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)