Breaking News

Haleem Price Hike: హలీం లవర్స్‌కు షాకింగ్ న్యూస్..

Published on Tue, 02/25/2025 - 07:23

చార్మినార్: రంజాన్‌ మాసంలో ప్రత్యేకమైన హలీం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ఏడాది రంజాన్‌ ప్రారంభానికి ముందే హలీం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మటన్‌ రేట్లు పెరగడంతో హలీం తయారీదారులు హలీం ధర పెంచేశారు. గతేడాది రూ.280లకు ప్లేట్‌ హలీం లభించగా..ప్రస్తుతం రూ.20 పెరిగి రూ.300 చేరుకుంది. ఇటీవల ముగిసిన నాంపల్లి ఎగ్జిబిషన్‌లో సైతం పిస్తాహౌజ్‌ ప్లేట్‌  హలీంను రూ.300 చొప్పున విక్రయించింది.

 అయితే ఎగ్జిబిషన్‌ ముగిసినా నగరంలోని పలు హోటళ్ల నిర్వాహకులు రూ.300కు విక్రయిస్తున్నారు. రేటు పెరిగినా హలీం ప్రియులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మార్చి 1న ఆకాశంలో నెల వంక కనిపిస్తే..2 నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం కానున్నట్లు ముస్లిం మత పెద్దలు పేర్కొంటున్నారు. రంజాన్‌ మాసంలో మాంసాహార వంటకాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించే ఇఫ్తార్‌ విందులో హాలీంను తప్పనిసరిగా వడ్డిస్తారు.  

పాతబస్తీ ప్రత్యేకం.. 
హలీం తయారీ, విక్రయాల్లో పాతబస్తీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు రంజాన్‌ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాతబస్తీలోని హాలీం హోటళ్లు వినియోగదారులతో కిటకిటలాడతాయి. పాతబస్తీలోని పిస్తాహౌజ్, మదీనా సర్కిల్‌లోని షాదాబ్‌ హోటల్, నయాగ్రా హోటల్, శాలిబండలోని షాగౌస్, బార్కాస్‌ తదితర హోటళ్లలో ఎన్నో ఏళ్లుగా హలీం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.  

 

#

Tags : 1

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)