Breaking News

ప్రియురాలితో కలసి జిమ్‌ ట్రైనర్‌ వల.. మహిళా పైలట్‌ను

Published on Sun, 06/14/2026 - 08:07

సనత్‌నగర్‌: ప్రియురాలితో పాటు జిమ్‌కు వచ్చే మహిళా పైలట్‌ను ఒకేసారి లైంగికంగా కలుసుకోవాలని జిమ్‌ ట్రైనర్‌ పథకం వేశాడు. అందుకు ప్రియురాలిని ఒప్పించడమే కాకుండా ఆ మహిళా పైలట్‌ను ఒప్పించే బాధ్యతను కూడా ఆమెపై పెట్టాడు. ఇందుకు మహిళా పైలట్‌ నిరాకరించడంతో ఫేక్‌ అకౌంట్లతో సోషల్‌ మీడియా వేదికగా ఆమె పట్ల అసభ్యకర సందేశాలు పంపిస్తూ మానసిక క్షోభకు గురిచేశాడు. దీంతో బాధితురాలు సనత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించగా జిమ్‌ ట్రైనర్‌తో పాటు అతని ప్రియురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ చౌరస్తా సమీపంలోని కల్ట్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ మేనేజర్, ట్రైనర్‌గా సంతోష్‌గౌడ్‌ వ్యవహరిస్తున్నాడు. ఇదే జిమ్‌కు వచ్చే మహిళా పైలట్‌పై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకునేందుకు తన ప్రియురాలు రజనితో కలిసి పథకం వేశాడు. ప్రియురాలి ద్వారా మహిళా పైలట్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇందుకు బాధితురాలు నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సంతోష్‌గౌడ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలను సృష్టించి  అసభ్యకర సందేశాలు పంపించాడు. వేధింపులు భరించలేక మహిళా పైలట్‌ సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సంతోష్‌గౌడ్, అతని ప్రియురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)