Breaking News

మీర్‌పేట్‌ హత్య కేసు.. గురుమూర్తికి 14 రోజుల రిమాండ్‌

Published on Wed, 01/29/2025 - 16:35

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీర్‌ పేట హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. గురుమూర్తికి కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 11వ తేదీ వరకు గురుమూర్తికి రిమాండ్‌ విధించింది. గురుమూర్తిని మీర్‌ పేట్‌ పోలీసులు.. చర్లపల్లి జైలుకు తరలించారు.

ప్రకాశం జిల్లా జేపీ చెరువు గ్రామానికి చెందిన గురుమూర్తి, వెంకట మాధవి (35) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఐదేళ్ల నుంచి జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలో అద్దెకు ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్యాభర్త­ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆమెను ఎలాగైనా హత్యచేయాలని పథకం వేసిన గురుమూర్తి.. సంక్రాంతి  సందర్భంగా ఈ నెల 14న భార్యా పిల్లలను తీసుకొని బడంగ్‌పేటలోని తన సోదరి సుజాత ఇంటికి వెళ్లాడు.

పిల్లలను అక్కడే వదిలేసి అదే రాత్రి భార్యతో కలిసి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయం మళ్లీ సోదరి ఇంటికి వెళ్లి రాత్రి వరకూ అక్కడే గడిపారు. పిల్లలను మళ్లీ అక్కడే ఉంచేసి రాత్రి 10 గంటలకు ఇద్దరూ ఇంటికి వచ్చారు. పథకం ప్రకారం 16న ఉదయం 8 గంటలకు భార్యతో వాగ్వాదానికి దిగి, ఆమె తలను గోడకేసి బలంగా బాదాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి వివస్త్రను చేసి, మళ్లీ శవాన్ని బెడ్‌ రూమ్‌లోకి తీసుకెళ్లి బెడ్‌పై పడేశాడు. పదునైన కత్తితో ముందుగా వెంకట మాధవి రెండు భుజాలు నరికాడు. తర్వాత కాళ్లు కోశాడు.

కాళ్లు, చేతులను చిన్న ముక్కలుగా చేసి బకెట్‌లో వాటర్‌ హీటర్‌తో ఉడకబెట్టాడు. తర్వాత వాటిని బయటికి తీసి, సింగిల్‌ బర్నల్‌ గ్యాస్‌ స్టవ్‌ మీద బాగా కాల్చాడు. కాలిన ముక్కలను రోలులో వేసి పొడిగా దంచాడు. ఎము కల పొడి, చిన్న చిన్న మాంసం ముద్దలను టాయిలెట్‌లో వేసి ఫ్లష్‌ చేశాడు. చిన్న శరీర అవశేషాలను తర్వాత పారవేసేందుకు వీలుగా ఇంట్లోని చెత్త డబ్బాలో వేశాడు. మిగిలిన మృతదేహాన్ని విడతల వారీగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లెలగూడ చెరువులో పడేశాడు. శరీర భాగాలను కాల్చుతున్నప్పుడు వాసన రాకుండా ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి పెట్టాడు. బాత్‌రూమ్, ఇంట్లో రక్తం మరకలు, దుర్వాసన పోయేందుకు డిటర్జెంట్, ఫినాయిల్‌తో శుభ్రం చేశాడు. 

ఏమీ తెలియనట్లుగా మిస్సింగ్‌ కేసు.. 
పండుగ తర్వాత ఇంటికొచ్చిన పిల్లలను నమ్మించేందుకు గురుమూర్తి ముందుగానే ఓ కట్టుకథను తయారుచేసుకున్నా­డు. అమ్మ ఏదని పిల్లలు అడిగితే బయటికి వెళ్లిందని చెప్పా­డు. తనకు చెప్పకుండా మాధవి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అత్త కుప్పాల సుబ్బమ్మకు తెలిపాడు. ఆమెతో కలిసి 18న మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్‌ కేసు పెట్టాడు. 

ఎలా చిక్కాడంటే.. 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురుమూర్తి అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. 15వ తేదీన రాత్రి 10:41 గంటలకు గురుమూర్తి, భార్య మాధవి ఇద్దరూ కలిసి ఇంటి లోపలికి వెళ్లడం గమనించారు. ఆ తర్వాత మాధవి బయటికి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదు కాలేదు. దీంతో గురుమూర్తే ఇంట్లో భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు ఓనిర్ధారణకు వచ్చారు. దీంతో వారు తమదైన పద్ధతిలో విచారించే సరికి భార్యను తానే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి ఇంట్లో నుంచి స్టవ్, కత్తి, రోలు, పొత్రం, బకెట్, వాటర్‌ హీటర్, హత్య సమయంలో వెంకటమాధవి ధరించిన దుస్తులు, ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు.

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు