Breaking News

ఇల్లెందుకు ‘సీతారామ’ నీళ్లివ్వండి

Published on Wed, 03/19/2025 - 04:26

సాక్షి, హైదరాబాద్‌: సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు నియోజకవర్గానికి తరలించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, బోడు, కొమరారం మండలాల ఏర్పాటు, ఇల్లెందు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. మంగళవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. 

దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, అఖిలపక్షాలతో భేటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్‌కు సీఎం సూచించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు ఊకె అబ్బయ్య, రాంచంద్రునాయక్, మురళీ నాయక్, రాందాసు నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులున్నారు.  

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల కృతజ్ఞతలు 
ఎస్సీల వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌లో సీఎంను కలిసిన వారిలో ఎస్సీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు, కాలె యాదయ్య, మందుల శామ్యేల్‌ ఉన్నారు.

నల్లగొండ జిల్లాకు చెందిన గిరిజన నేత కె.శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు పలువురు గిరిజన ఎమ్మెల్యేలు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించినందుకు మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)