Breaking News

‘గెస్ట్‌’ పోలీస్‌ స్టేషన్‌!

Published on Tue, 09/30/2025 - 13:14

వరంగల్ జిల్లా: గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌కు ‘గెస్ట్‌’ పోలీస్‌ స్టేషన్‌ అనే పేరుంది (నిక్‌నేమ్‌). పోలీసు అధికారులు ఈ స్టేషన్‌కు అలా గెస్ట్‌లా వచ్చి కొన్ని రోజులు పని చేసి బదిలీపై వెళ్లిపోతుంటారు. సీఐలు అయితే మహా అంటే ఏడాది లోపు.. ఎస్సైల విషయం చెప్పాల్సిన పనే లేదు. బదిలీపై వచ్చిన ఎస్సైలు ఇక్కడ ఎన్ని నెలలు ఉంటారో లేదో తెలియదు. కొందరైతే పోస్టింగ్‌పై వచ్చి రెండు, మూడు నెలల లోపే బదిలీ అవుతున్నారు. గతంలో అయితే బదిలీపై వచ్చిన పోలీసు అధికారులు కనీసం ఏడాది, రెండేళ్ల వరకు విధులు నిర్వర్తించేవారు. దీంతో వారికి స్థానిక పరిస్థితులపై, ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో అవగాహన కోసం అవసరమైన సమయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది.

 వచ్చిన అధికారికి మండలంలోని గ్రామాల పేర్లు, రూట్‌లు, స్థానిక స్థితిగతులు తెలుసుకునే లోపే  బదిలీ అవుతుండడం విశేషం. నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌కు ప్రత్యేకత ఉంది. ఈ పోలీస్‌ సేషన్‌ పరిధిలోని గీసుకొండ రూరల్‌ మండలంలోని గ్రామాలతోపాటు గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని 15,16,17 డివిజన్లు ఉన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉండే మండలంలో ప్రశాంతంగా ఉన్నట్లే కనిపించినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయని ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన పలువురు పోలీసు అధికారులే చెబుతున్నారు.

అలాంటి పరిస్థితిలో డ్యూటీలో చేరిన నెలలోపే బదిలీ చేస్తుండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గీసుకొండ సీఐ మహేందర్‌ను ఇక్కడి నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూంకు బదిలీ చేస్తూ ఆదివారం  ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ఇక్కడికి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఆయన స్థానంలో పోలీస్‌ కంట్రోల్‌ రూంలో విధులు నిర్వహిస్తున్న డి. విశ్వేశ్వర్‌ను గీసుకొండకు బదిలీ చేశారు. విశ్వేశ్వర్‌ ఇదే పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా  2012 జూలై నుంచి 2013 ఆగస్టు వరకు పని చేశారు. అప్పట్లో ఆయన పనితీరును చూసి మండల వాసులు గబ్బర్‌సింగ్‌ అని పిలిచేవారు.  

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)