Breaking News

దొంగను పట్టుకున్నాం సార్‌! అయితే స్టేషన్‌లో దింపేసి వెళ్లండి

Published on Thu, 07/09/2026 - 13:55

నెల్లూరు జిల్లా: ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేసేందుకు ఒంటి కాలిపై పరుగులెత్తే పోలీసులు శాంతిభద్రలను కాపాడడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రజల ఆస్తులను దొంగిలించేందుకు వచ్చిన దొంగను పట్టుకుని పోలీసులకు ఫోన్‌ చేసి ‘దొంగను పట్టుకున్నాం.. తీసుకెళ్లండి’ అంటే.. సారీ.. మా స్టేషన్‌లో సిబ్బంది లేరు స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించండి అంటూ తాపీగా సమాధానం ఇచ్చారు. 

ఈ ఘటన గూడూరు పట్టణంలో బుధవారం వేకువ జామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ నడి»ొడ్డులోని చర్చి కాంపౌండ్‌లో ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఇంట్లో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా యజమానికి మెలుకువ వచ్చి అతన్ని పట్టుకుని నిలదీస్తే అతను గంజాయి మత్తులో ఉన్నాడు. దీంతో చుట్టు పక్కల నివాసాల్లోని వారు చేరుకుని అతని నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా హిందీలో మాట్లాడుతూ హల్‌చల్‌ చేయడంతో స్థానికులు 100కు డయల్‌ చేశారు.

కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం అందడంతో వారు అరగంట తరువాత ఫోన్‌ చేసి ఏమి జరిగిందనే విషయం అడిగి తెలుసుకున్నారు. అపరిచిత వ్యక్తిని పట్టుకున్నాం, మీరు వచ్చి తీసుకుని వెళ్లండని పోలీసులకు తెలియజేస్తే స్టేషన్లో సిబ్బంది లేరు, అందరూ బందోబస్తుకు వెళ్లి ఉన్నారు. కాబట్టి మీరే అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించండని చెప్పారు. దీంతో అపరిచిత వ్యక్తిని చర్చి కాంపౌండ్‌ వాసులు బజారులో వదలి వేశారు. ఇలా అపరిచితులు ఇష్టానుసారంగా పట్టణంలో సంచరిస్తుంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)