Breaking News

అంతా చూస్తున్నారు.. అతి వద్దు!

Published on Fri, 05/30/2025 - 01:58

సాక్షి, హైదరాబాద్‌: ‘విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్‌ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తాం... సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రణాళిక కొనసాగుతోంది’ఇదీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల ప్రకటించిన విషయం. దీన్నిబట్టి చూస్తే సోషల్‌ మీడియా ప్రొఫైలింగ్‌కు ఎంతటి ప్రాధాన్యత పెరుగుతుందో అర్థమవుతోంది. కేవలం విదేశాల్లో చదువు, ఉద్యోగాలకు వెళ్లే వారికే కాదు.. స్థానికంగా ఉద్యోగాలు పొందాలనుకునే యువతకు సంబంధించి సైతం ఆయా సంస్థలు ఇటీవల సోషల్‌ మీడియా ప్రొఫైలింగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. 

సదరు వ్యక్తి సోషల్‌ మీడియాలో వెల్లడించే భావాలు.. పెడుతున్న పోస్టులు, కామెంట్లు, వీడియోల ఆధారంగా అతడి వ్యక్తి త్వం ఏంటి? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? ఇలా అనేక విషయాల్ని అంచనా వేస్తు న్నాయి. ఇంకాస్త లోతుగా వెళితే పెళ్లి సంబంధాల సమయంలోనూ అబ్బాయి–అమ్మాయిల గురించి, వారి స్నేహాలు, ప్రవర్తన, ఇతరులతో ఉన్న సంబంధాలపై ఒక అంచనాకు వస్తున్నారు. 

ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌లలో వాళ్లు షేర్‌ చేసే ఫొటోలు, వీడియోల ఆధారంగా కూడా ప్రవర్తన, నడవడికను ఇట్టే అంచనా వేస్తున్న రోజులివి. అందుకే సోషల్‌ మీడియాలో అంతాచూస్తున్నారని, కాబట్టి అతి ధోరణి వద్దని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఫన్‌ పేరిట కించపర్చేలా వ్యాఖ్యలు 
సాంకేతికతతో ఎంత ఉపయోగం ఉంటుందో.. అంతేస్థాయిలో అనర్థాలున్నాయి. నేటి యువత ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్‌ వాడటం పరిపాటిగా మారింది. గంటల తరబడి చాటింగ్‌లు, మీటింగ్‌ల్లో కొందరు హద్దు దాటుతున్నారు. యువత, విద్యార్థులు ఫన్‌ పేరిట ఎదుటి వారిని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.. తోటి విద్యార్థులను సైబర్‌ బుల్లీయింగ్‌ (తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం) చేస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యలు, మతపరమైన వివాదాస్పద కామెంట్లు పెడుతుంటారు. 

ఈ వ్యాఖ్యలే వారిపాలిట ఇబ్బందికరంగా మారుతున్నాయి. కొన్నిసార్లు వీసాల రద్దు వరకు దారి తీస్తున్నాయి. ఎంబసీల్లోని అధికారులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సోషల్‌ మీడియా ఖాతాలు వెరిఫై చేస్తున్నారు. యూకే, కెనడా, అమెరికా లేదా ఇతర ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాలు ఆమోదం పొందడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సోషల్‌ మీడియా ప్రొఫైలింగ్‌. అందుకే మన వ్యక్తిగత ప్రవర్తన కేవలం బయటి సమాజంలోనే కాదు.. సోషల్‌ మీడియా ప్రపంచంలోనూ ఉన్నతంగా ఉండాలని చెబుతున్నారు. 

మన చేతుల్లోనే.. మన భవిష్యత్తు
» కేవలం విదేశాల్లో విద్యా అవకాశాల విషయంలోనే కాదు.. అన్ని వయస్సుల వారి అవకాశాలకు ప్రతిబంధకంగా ఈ సోషల్‌ మీడియా ప్రొఫైలింగ్‌ మారుతోందని మరవొద్దు.  
»    పెళ్లి సంబంధమైనా, కొత్త ఉద్యోగమైనా సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాల వెతుకులాట కొనసాగుతోందని మరవొద్దు.  
»   ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సోషల్‌ మీడియా యాప్‌లలో, వాట్సాప్‌ వంటి గ్రూప్‌ల్లో సంయమనంతో ఉండకపోతే చిక్కులు తప్పవు.
  
»  అనసవర వ్యాఖ్యలు చేయడంతో కొన్నిసార్లు ఇతర కంపెనీల్లో గొప్ప ఆఫర్లు వచ్చినా ఉద్యోగాలు పొందలేని పరిస్థితి. అదేవిధంగా ఒక ఉద్యోగి మతం, ప్రాంతం, కులాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు పోస్టులు పెడితే ఉద్యోగ ఎదుగుదలకు అవి ప్రతిబంధకాలుగా మారే ప్రమాదం ఉంటుంది.  
»  మన వ్యక్తిగత వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, ఫ్రెండ్స్‌ ఎవరు, తరచూ ఎక్కడికి వెళుతుంటాం.. వీటన్నింటినీ క్రోడీకరించి ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ వాడి అవతలి వ్యక్తి ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ డెవలప్‌ చేయొచ్చని సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

అతిగా సమాచారం అనవసరం.. 
సోషల్‌ మీడియాలో కొందరు తమ సమస్త వివరాలు చెబుతుంటారు. కానీ, అవసరానికి మించి ఏ వ్యక్తిగత సమాచారమూ సోషల్‌ మీడియాలో పంచుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. పుట్టిన రోజులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు, మన స్వస్థలాల వివరాలు వీలైనంత వరకు పెట్టకుండా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్‌ మీడియా వాడకంపై సరైన అవగాహన ఉండాలని పేర్కొంటున్నారు. మన వ్యక్తిగత సమాచారం మనం కాకుండా ఏ వెబ్‌సైట్‌లో, సెర్చ్‌ ఇంజిన్‌లో చూసినా వెంటనే దాన్ని తొలగించాలని ఆ వెబ్‌సైట్‌ను కోరాలని వారు సూచిస్తున్నారు. 

సోషల్‌ మీడియా ప్రొఫైలింగ్‌ అంటే..?  
ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్‌ (ట్విట్టర్‌), స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా యాప్‌లలో ఖాతాలున్న వారు.. వాటిల్లో షేర్‌ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు, వివరాలు, పెడుతున్న కామెంట్లు అన్నింటినీ క్రోడీకరించి అవతలి వ్యక్తి గురించి అంచనావేసే పద్ధతినే సోషల్‌ మీడియా ప్రొఫైలింగ్‌అంటాం. దీని ఆధారంగా ఒక వ్యక్తి సామాజిక ప్రవర్తనను దాదాపుగా అంచనా వేయొచ్చు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)