Breaking News

TGPSC ఆఫీస్‌ ముందు పోస్టర్ల కలకలం

Published on Fri, 10/04/2024 - 09:59

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ, హైదరగూడలోని తెలుగు అకాడమీ ముందు గుర్తు తెలియని అగంతకులు పోస్టర్లను అతికించారు.

ఆ పోస్టర్లలలో తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే టీజీపీఎస్సీ ముందు నేను ఒక నియంతని.. తప్పు జరిగితే ఒప్పుకోను అని పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

అంతేకాదు గ్రూప్‌-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు..సిగ్గు, టీజీపీఎస్సీ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ పోస్టర్‌లు కనిపించాయి. పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లను ఎవరు అంటించారోనని ఆరా తీస్తున్నారు.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)