Breaking News

Group-1 Exam: అట్టుడికిన సిటీ

Published on Sun, 10/20/2024 - 07:21

సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం అట్టుడికింది. ఆందోళనలు, ధర్నాలు, ముట్టడి, బంద్‌ పిలుపులతో నగరం గరం గరంగా మారింది. ఎక్కడికక్కడ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఆందోళనకారుల అరెస్టులు, లాఠీచార్జ్‌లతో శనివారం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీఓ నం–29ను రద్దు చేయాలని గ్రూప్‌–1 అభ్యర్థుల మూడు రోజులుగా అశోక్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

 కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సెక్రటేరియట్‌ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అభ్యర్థులను, మంత్రిని పోలీసులు నిలువరించడంతో అశోక్‌నగర్‌ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అశోక్‌నగర్‌ చౌరస్తా నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు పూర్తిగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సెక్రటేరియట్‌ ముట్టడికి వెళ్తున్న క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. 



సికింద్రాబాద్‌ బంద్‌లో లాఠీచార్జ్‌.. 
కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచి్చన సికింద్రాబాద్‌ బంద్‌లో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద నుంచి వేలాది మంది ర్యాలీగా బయలుదేరారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, హిందూవాహిని, బీజేపీ  తదితర సంస్థలకు చెందిన ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్‌ చాలీసా చదివి అక్కడి నుంచి బాటా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు, కురీ్చలు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. లాఠీచార్జిలో నలుగురు యువకులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగిపోయింది. బంద్, ర్యాలీలతో సికింద్రాబాద్‌లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

స్వచ్ఛందంగా షాపులు మూసిన వ్యాపారులు 
రాంగోపాల్‌పేట్‌: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచి్చన బంద్‌ శనివారం ప్రశాంతంగా సాగింది. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు పలికారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)