గ్రేటర్‌ నగరంపై నిర్మలమ్మ కరుణ చూపేనా?

Published on Sun, 02/01/2026 - 07:57

గ్రేటర్‌ నగరానికి ఊతం.. పెండింగ్‌ ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌.. సుస్థిర ఆర్థిక వృద్ధికి సాయం.. ఇలా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మహా నగరం ఎన్నో ఆశలు పెట్టుకుంది. బల్దియా పరిధిలో అభివృద్ధి పథకాలకు ఆసరా కలిగించేలా నిర్మలమ్మ కరుణ చూపుతారని అంతా ఆశిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళికలో మూసీ నది భాగస్వామ్యం, మెట్రో, ఎంఎంటీఎస్, హెచ్‌ఎండీఏ.. ఇలా వివిధ విభాగాల్లో ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపేలా.. నిధులు భారీగా విదిలించేలా ‘ఆశల పద్దు’పై ఈ పొద్దు ఎంతో ఉత్కంఠగా గ్రేటర్‌ నగరం ఎదురు చూస్తోంది.  

బల్దియా విన్నపాలు వినవలె..
గత ఆర్థిక సంవత్సరం కేంద్రంపై ఆశలతో రూ.10,500 కోట్ల నిధులివ్వాలని విజ్ఞాపనలు చేసిన జీహెచ్‌ఎంసీ ఓవైపు వాటి కోసం ఎదురు చూస్తూనే.. మరోవైపు, కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.719 కోట్లు రాగలవనే ఆశలు పెట్టుకుంది. ఆ ఆశతోనే జీహెచ్‌ఎంసీ కొత్త బడ్జెట్‌ (2026–27)లో కేటాయింపులు చేసింది. ఘనవ్యర్థాల నిర్వహణ కోసం రూ.279 కోట్లు, నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం పనులకు  రూ.140 కోట్లు,  పేదల గృహ నిర్మాణానికి రూ.100 కోట్లు, ప్రత్యేక ఆర్థిక సహకారంగా రూ.200 కోట్లు కేంద్రం నుంచి ఆశిస్తోంది.

జలమండలికి కావాలి రూ.49,196 కోట్లు 
మహా నగర తాగునీటి అవసరాలు, మురుగునీటి పారుదల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు జలమండలి కేంద్ర బడ్జెట్‌పై పెట్టుకుంది. ప్రస్తుతం కేంద్రం వద్ద సుమారు రూ.49,196 కోట్ల విలువైన తొమ్మిది  పథకాల ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో అమృత్‌ 2.0, జల్‌ జీవన్‌ మిషన్, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ వంటి పథకాల కింద నిధులు మంజూరు కావాల్సి ఉంది.

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లకు నిధులిస్తారా? 
హెచ్‌ఎండీఏ పరిధిలోని సుమారు 10,050 చ.కి.మీ పరిధిలో రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన దృష్టి సారించారు. వివిధ చోట్ల 10 గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి  సుమారు రూ.4,5000 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.ఈ మేరకు కేంద్రం  నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.  

మూసీ మురిసేనా..? 
జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళికలో మూసీ నదిని భాగస్వామ్యం చేయాలని.. రూ.3,188 కోట్లు అందించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ప్రాథమిక ప్రాజెక్ట్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమరి్పంచింది. కేంద్రంపై  పెట్టుకున్న ఆశలు ప్రస్తుత బడ్జెట్‌లో నెరవేరుతాయో లేదో చూడాలి.  

రెండో దశకు రెక్కలొచ్చేనా?
మెట్రో రెండో దశలో ‘ఎ’, ‘బి’ విభాగాల కింద విస్తరించనున్న 8 కారిడార్‌ల నిర్మాణం కోసం కేంద్రం వాటా 50 శాతం నిధులను అందజేయాల్సి ఉంది. రెండో దశలో చేపట్టనున్న 76.4 కి.మీ మొదటి  5 లేన్‌ల నిర్మాణం కోసం  రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ‘బి’ విభాగం కింద మూడు మార్గాల్లో నిర్మించనున్న 86.1 కి.మీ కారిడార్‌లకు మరో రూ.19,759 కోట్లతో అంచనాలను రూపొందించారు. మెట్రో విస్తరణకు మాత్రం  కేంద్రం నిధులను విడుదల చేయకపోవడమే కాకుండా సాంకేతిక కారణాల దృష్ట్యా  రెండో దశ ప్రాజెక్టును పక్కన  

ఎంఎంటీఎస్, చర్లపల్లి టెరి్మనల్‌ కనెక్టివిటీలకు బ్రేక్‌.. 
కొత్త లైన్‌లతో పాటు 9 బోగీలతో కూడిన ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా నడపాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా పట్టాలెక్కలేదు. అలాగే.. చర్లపల్లి టెర్మినల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా పునరభివృద్ధి చేసినప్పటికీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంఎంటీఎస్, సిటీబస్‌ కనెక్టివిటీ అరకొరగానే ఉంది. గత ఏడాది బడ్జెట్‌లో యాదాద్రికి ఎంఎంటీఎస్‌ పొడిగింపునకు రూ.10 కోట్లు కేటాయించినా.. ఈ ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. నిధులు, వనరులు, భూమి, మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. రైల్వేశాఖ రూ.60 కోట్లు కేటాయించినా పనులు  ప్రారంభించలేదు.

తెలంగాణ సంపర్క్‌ క్రాంతి పట్టాలెక్కేనా?
ఏళ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఈసారి కేంద్రం పచ్చజెండా  ఊపనుందా...ఇప్పటికే  రైల్వేబోర్డు ప్రతిపాదనల్లో ఉన్న ఈ ట్రైన్‌కు ఈ బడ్జెట్‌లో  ఆమోదం లభించనుందా.. రైల్వేవర్గాలు అందుకు అవుననే  చెబుతున్నాయి.  
 

Videos

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)