Breaking News

పంచాయతీ ఎన్నికలకు సాయంత్రమే షెడ్యూల్‌

Published on Tue, 11/25/2025 - 14:24

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు సాయంత్రం 6:15 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్‌ నిర్వహించనుంది. ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను ప్రకటించనుంది. అయితే, ఎన్నికల సంఘం డిసెంబర్‌ 11న తొలివిడుత ఎన్నికల పోలింగ్‌ ఉదయం ఏడు గంటల నుంచి మద్యాహ్నం 2గంటల వరకు నిర్వహించనుంది. మద్యాహ్నం రెండు గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్‌, ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు 
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్‌ జర్నల్‌ కోర్టుకు తెలపనున్నారు. ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేశామని వివరించనున్నారు.  

సుప్రీం కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికల నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. గత విచారణలో సైతం ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఆదేశాల్ని తెలంగాణ హైకోర్టు ప్రస్తావించింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 243(E)(3) ప్రకారం గడువు ముగిసిన తరువాత 6 నెలలోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ విచారణలో పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్ జనరల్ వివరించనున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)