బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...
Breaking News
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
ఆరబోసిన ధాన్యం నీటిపాలు
Published on Wed, 10/23/2024 - 04:12
చౌటుప్పల్: సకాలంలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటిపాలు చేయాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మంగళవారం సాయంత్రం కురిసిన ఆకస్మిక భారీ వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి.
ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టుకుని తిరిగి కుప్పలు పోసుకునే సమయంలో వర్షం రావడంతో రైతులు ఏమి చేయాలో తెలియక పరుగులుపెట్టారు. అప్పటికప్పుడు ధాన్యాన్ని కుప్పలుగా పోసుకున్నారు. పట్టాలు కప్పుకున్నారు. పెద్ద ధాన్యం కుప్పలను ట్రాక్టర్లతో దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయినా వర్షం భారీగా కురవడంతో వరద నీటి ప్రవాహంలో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు బోరున విలపించారు.
#
Tags : 1