Breaking News

కార్మికులకు అండగా ఉన్నా..

Published on Sun, 08/06/2023 - 02:55

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును హడావుడిగా ప్రవేశపెట్టడం సరికాదని, అందులోని అంశాలపై విస్తృత చర్చ కోసం భాగస్వామ్య పక్షాలకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఆపడం వెనక తనకు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలేమీ లేవని.. ప్రజలు, ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను రక్షించడమే తన ఉద్దేశమని చెప్పారు.

తాను ఎల్లçప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటానని, గత సమ్మె సమయంలో కూడా కార్మికులకు అండగా నిలబడి అర్ధరాత్రి వారి సమస్యలను విన్నానని గుర్తు చేశారు. శనివారం ఆమె పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడారు.

43,373 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు పట్ల ఆందోళన, సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన వివరణలు అందాక.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

పీఆర్సీ, గ్రాట్యుటీ చెల్లింపు ఎప్పుడు? 
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణలు (పీఆర్సీలు), ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్మెంట్‌ బకాయిల చెల్లింపు వంటివి పెండింగ్‌లో ఉండటంపై గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ సహకార సొసైటీకి చెందిన రూ.3 వేల కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం తీసుకుని ఇప్పటివరకు చెల్లించలేదని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధ అధిపతిగా రాజ్యాంగ నియమాల పరిరక్షణతోపాటు ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. 

ధర్నాకు మంత్రుల వ్యూహరచన: ఉద్యోగ సంఘాలు 
ఉద్యోగ సంఘాలు ఎలాంటి సమ్మెకు పిలుపు ఇవ్వలేదని వీడియో కాన్ఫరెన్స్‌లో జేఏసీ ప్రతినిధులు గవర్నర్‌కు చెప్పారు. ప్రభుత్వ ప్రోద్బలంతో బలవంతంగా సమ్మె చేయించారని, మహిళా ఉద్యోగులను సైతం వదిలిపెట్టలేదని ఆరోపించారు. రాజ్‌భవన్‌ ముట్టడి జరపాలని తమపై ఒత్తిడి తెచ్చారని.. ధర్నాకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యూహరచన చేశారని పేర్కొన్నారు.  

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)