Breaking News

బదిలీలు లేనట్టే..!

Published on Mon, 01/01/2024 - 04:34

సాక్షి, హైదరాబాద్‌: సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులను మార్చారు. ఇటు ప్రభుత్వ, అటు పోలీస్‌ యంత్రాంగంలోని సీనియర్‌ అధికారుల్లో కొందరికి స్థానచలనం కలిగించారు. మరికొందరు ఐఏఎస్‌ అధికారులు, ఒకట్రెండు జిల్లాల కలెక్టర్ల మార్పు కూడా జరిగింది. దీంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన ఉంటుందని, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు సంబంధించిన ముఖ్యమైన బదిలీలుంటాయనే ప్రచారం కూడా జరిగింది.

అయితే, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అలాంటి ఆలోచన లేదని, పలు కారణాల రీత్యా మరో మూడు నెలల తర్వాతే పూర్తిస్థాయి ప్రక్షాళన ఉంటుందనే సంకేతాలందుతున్నాయి. ప్రస్తుతానికి తప్పనిసరి బదిలీలకు మాత్రమే పరిమితం కావాలని, ఆరుగ్యారంటీల అమలు ఓ కొలిక్కి రావడంతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన తర్వాతే భారీస్థాయిలో బదిలీలు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.  

ఆరంభ దశలోనే ‘ప్రజాపాలన’ 
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డితో సహా ఏఐసీసీ కీలక నేతలు పలుమార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే మిగిలిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే గత నెల 28న ‘ప్రజాపాలన’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకొని, గ్యారంటీలు అమలు చేసే ప్రక్రియతో ముందుకెళుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాగాన్ని బదిలీ చేయడం అవసరం లేదనే భావనలో సీఎం రేవంత్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత, వచ్చిన అన్ని దరఖాస్తులను మదింపు చేయాలి. వీటి ఆధారంగా రేషన్‌కార్డుల పంపిణీ నుంచి 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్‌ వరకు మార్గదర్శకాలు రూపొందించాలి.

దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం మరో నెలకు పైగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ, ఆరుగ్యారంటీల అమలు ఓ కొలిక్కి వస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా మార్చి 15 వరకు (100 రోజుల్లో) ఈ ఆరు గ్యారంటీలు అమలు ప్రారంభించాలి. దీంతో ఇప్పుడు బదిలీలు చేస్తే కొంత గందరగోళానికి తావిస్తాయనే భావనలో సీఎం ఉన్నట్టు సమాచారం.  

ఈసీ ఏం చేస్తుందో? 
రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాకపోయినా ఓటరుజాబితా సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈనెల 6 వరకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాలి. అనంతరం సవరణలు చేపట్టి వచ్చే నెల 8న పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా ప్రకటించాలి. మరోవైపు నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ కూడా వచ్చింది. ఈ ఎన్నికకు ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు చేపట్టాలన్నా, ఎన్ని కల కమిషన్‌కు సమాచారం ఇవ్వాలి. మరోవైపు ఫిబ్రవరి రెండోవారం తర్వాత ఎప్పుడైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశాలున్నాయి. ఈలోపు కలెక్టర్లు, ఇతర అధికారులను బదిలీ చేస్తే అప్పుడు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం మరికొన్ని బదిలీలు చేయాల్సి ఉంటుంది.

దీంతో కలెక్టర్ల బదిలీల గురించి కూడా సీఎం రేవంత్‌ పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు కూడా ఉండవని, అవసరమైతేనే కొన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్‌కు సమాచారమిచ్చి ఈసీ అనుమతి మేరకు బదిలీలు జరిగే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ ప్రభుత్వవర్గాల్లో జరుగుతోంది.  

ఎన్నికలు ముగిశాకే.. అన్ని స్థాయిల్లో 
రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప లోక్‌సభ ఎన్నికలు ముగిసేంతవరకు ప్రభుత్వ యంత్రాంగ బదిలీలుండవని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ నేతలకు కూడా ఆ పార్టీ పెద్దలు సంకేతాలిస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సమీక్ష సమావేశంలో ఇదే విషయాన్ని ఓ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కాంగ్రెస్‌ నేతలకు చెప్పినట్టు తెలిసింది.

ఇప్పటికిప్పుడు బదిలీలు చేయలేం కానీ, మొండి ఘటాలను మాత్రం వదిలించుకుందామని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పూర్తిస్థాయిలో సఖ్యత లేదనే ముద్ర ఉన్న అధికారులకు అడపాదడపా స్థానచలనం కలగవచ్చని, గత ప్రభుత్వానికి అంటకాగారనే ముద్ర ఉన్న అధికారులను కూడా బదిలీ చేయొచ్చని అంటున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)