Breaking News

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025: నేటి నుంచి సీఎం సమీక్షా సమావేశాలు

Published on Tue, 11/25/2025 - 12:38

సాక్షి, హైదరాబాద్: డిసెంబర్‌ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి సమీక్షా సమావేశాలు జరుగనున్నాయి. ప్రతి రోజు వేర్వేరు అంశాలపై అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష చేయనున్నారు.

నవంబర్‌ 25 – సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు 
సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సంబంధిత విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు  పాల్గొని సమ్మిట్‌ నిర్వహణ, కీలక కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు.

నవంబర్‌ 26న లాజిస్టిక్స్‌, ఇతర ఏర్పాట్ల గురించి సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొంటారు. సమ్మిట్‌కు వచ్చే దేశీయ, విదేశీ ప్రతినిధుల రవాణా, నివాసం, భద్రత వంటి లాజిస్టిక్స్ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.

నవంబర్‌ 27న జరగనున్న సమావేశానికి మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మోహమ్మద్‌ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. సమ్మిట్‌ వేదిక, రోడ్లు, కమ్యూనికేషన్‌, విద్యుత్‌, అతిథి సదుపాయాలు మొదలైన మౌలిక వసతులపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు.

నవంబర్‌ 28న సాయంత్రం 4 గంటలకు సీఎం, మంత్రి వాకాటి శ్రీహరి, వివేక్‌ వెంకటస్వామి పాల్గొని విద్యాసంస్థల భాగస్వామ్యం, యువజన కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 

దాంతో పాటు ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పాల్గొని పర్యాటక ప్రోత్సాహక ప్రణాళికలను పరిశీలించనున్నారు.

నవంబర్‌ 29న సాయంత్రం 4 గంటలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వాకాటి శ్రీహరి పాల్గొనబోతున్నారు. రైతులకు కొత్త అవకాశాలు, సమ్మిట్‌లో అగ్రి–ఇన్నోవేషన్‌ సెషన్లపై చర్చించనున్నారు.

సాయంత్రం 6 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, సీతక్క, మోహమ్మద్‌ అజరుద్దీన్ పాల్గొని సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నారు.

నవంబర్‌ 30న సీఎంతో పాటు ఆరోగ్య మంత్రి దామోదర్‌ రాజనరసింహ, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని హెల్త్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, మెడికల్‌ టూరిజం అవకాశాలు, గ్లోబల్ హెల్త్ సెషన్లపై సమగ్ర సమీక్ష జరుగుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)