Breaking News

కొట్టుకుపోతుంటే.. ప్రాణాలకు తెగించి మరీ

Published on Wed, 07/26/2023 - 08:35

తెలంగాణలో వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో ఆపదలో ఆదుకునే హెల్ఫింగ్‌ హ్యాండ్స్‌ అక్కడక్కడా కనిపిస్తున్నాయి.

వాగులో కొట్టుకుపోయి.. పైపులో ఇరుక్కుని.. 
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లంబాడితండాలో ఎర్రవాగు పోటెత్తి లోలెవల్‌ వంతెనపైనుంచి ప్రవహిస్తోంది. ఇక్కడి జంగాల్‌పేటకు చెందిన సమ్మయ్య అనే రైతు వంతెన దాటేందుకు ప్రయతి్నస్తూ నీటిలో కొట్టుకుపో­యాడు. కొంత దూరంలో వాగులో ఉన్న పైపులో చిక్కుకున్నాడు. పోలీసులు, స్థానిక యువకులు కలిసి ఆయనను కాపాడారు. 


మూలవాగులో చిక్కుకుని.. 
జగిత్యాల జిల్లా శెట్టిపల్లికి చెందిన మారుతి ప్రమాదవశాత్తు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో చిక్కుకుపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వాగు వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు తాళ్ల సాయంతో వాగులోకి  దిగి మారుతిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. 


వరద నీటిలో అంతిమయాత్ర 
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన బస్వరాజు బాలయ్య (70) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామానికి ఆనుకుని వాగు ఒడ్డున వైకుంఠ ధామం ఉంది. భారీ వర్షాలతో వాగులో నడుములోతు నీటి ప్రవాహం కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు వరదలోనే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 


ఇళ్లలోకి రోళ్ల వాగు నీళ్లు 
జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలో రోళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై ఉన్న ప్రాజెక్టు కాల్వల నుంచి వరద ఉప్పొంగడంతో.. దిగువన ఉన్న నర్సింహులపల్లె గ్రామం జలమయమైంది. ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)