శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

Published on Wed, 03/29/2023 - 19:39

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వ‌చ్చిన న‌లుగురు మ‌హిళల నుంచి 3,175 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని క్యాప్సూల్స్‌లో నింపి మహిళలు తమ కడుపులో దాచి తరలించే ప్రయత్నం చేయగా.. అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్‌లో బంగారం బయట పడింది. ప‌ట్టుబ‌డ్డ బంగారం విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుంద‌ని తెలిపారు. ఈ న‌లుగురు మ‌హిళ‌ల‌ను క‌స్ట‌మ్స్ అధికారులు శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా మంగళవారమే శంషాబాద్ ఎయిర్ పోర్టులో  దుబాయ్‌ నుంచి ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 66 లక్షల విలువ చేసే 1,100 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. తెల్లవారుజామున వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.52.24 లక్షల విలువ చేసే 840 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడి నుంచి రూ.14.23 లక్షల విలువైన 233 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మొదటి ప్రయాణికుడు ముద్ద రూపంలో బంగారాన్ని తీసుకురాగా.. రెండో ప్రయాణికుడు తున చేప ఆయిల్ డబ్బాల మధ్య దాచుకుని తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.  ఇద్దరు దుబాయ్ ప్రయాణికులను అరెస్ట్‌ చేసిన అధికారులు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: హైదరాబాద్‌లో మళ్లీ పోస్టర్‌ వార్‌.. అదే దారిలో బీజేపీ కౌంటర్‌

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)