Breaking News

భాగ్యనగరంలో బంగారం చోరీ.. హీరో సూర్యా గ్యాంగ్ మూవీ లెవెల్‌లో..

Published on Sun, 05/28/2023 - 16:38

హైదరాబాద్‌:సూర్య గ్యాంగ్ మూవీ చూశారుగా?. ఐటీ అధికారులుగా వెళ్లి.. నిమిషాల్లో కోట్ల సంపదను దోచేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఐటీ అధికారులుగా గోల్డ్ షాపులోకి వెళ్లి 1.7కిలోల బంగారాన్ని నిమిషాల్లోనే దర్జాగా ఎత్తుకెళ్లారు కెటుగాళ్లు.

మోండా మార్కెట్‌లో ఓ బంగారం షాపు రోజూలాగే ఉదయం ప్రారంభమైంది. యజమాని వేరే ఊరికి వెళ్లిన కారణంగా దగ్గరి బంధువు షాప్‌ను చూసుకుంటున్నారు. కస్టమర్లు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. ఈ క్రమంలోనే సూటు.. బూటు ధరించిన కొంతమంది షాపులోకి ప్రవేశించి హడావిడి చేశారు. ఐటీ అధికారలమంటూ.. ఫేక్ ఐడీలను చూపించి దుకాణంలోని స్టాఫ్‌ను పక్కకు కూర్చోబెట్టారు.  అధికారుల లాగే స్వరం పెంచి షాపులోని బంగారం అమ్మకాల అకౌంట్ బుక్కులను చెక్‌ చేశారు.

ట్యాక్స్ చెల్లించలేదంటూ 1.7కిలోల బంగారం బిస్కెట్‌లను దుండగులు తీసుకువెళ్లారు. అనుమానం వచ్చిన సిబ్బంది ఇతర షాపు ఓనర్లకు ఫోన్ చేసి కనుక్కోగా అసలు విషయం బయటపడింది. ఐటీ అధికారులు నేరుగా షాపులోకి వచ్చేయరని, ముందు నోటీసులు ఇస్తారని ఇతర షాపు యజమానులు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు సికింద్రబాద్‌ నుంచి ఉప్పల్ మార్గంలో వెళ్లినట్లు పోలీసులు గుర‍్తించారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..:

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)