Breaking News

భద్రాచలం వద్ద మహోగ్రం.. కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక 

Published on Sun, 07/30/2023 - 01:37

రాష్ట్రవ్యాప్తంగా వానలు తెరిపించినా.. ఇప్పటికే చేరిన నీటితో ఉప నదు లు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో గోదా వరి మహోగ్ర రూపం కొనసాగుతోంది. శనివారం రాత్రి 10గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 16 లక్షల క్యూసెక్కులకు, నీటి మట్టం 56 అడుగులకు పెరిగింది. భారీగా వరద వస్తుండటంతో నీటి మ ట్టం మెల్లగా పెరుగుతూనే ఉంది. దీనితో అధికారు లు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నా రు. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాల్లోనే ఉంచారు. మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవిత తదితరులు సహాయక చర్యలను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. శనివారం మధ్యా హ్నం 2 గంటల వరకు కూడా పునరావాస కేంద్రాల్లోని బాధితులకు భోజనం పెట్టకపోవడంతో వారంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్డీఓ మాధవి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు 3 గంటలకు భోజనం అందించారు. 

ఎగువ నుంచి తగ్గుతూ.. 
ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో.. ఎగువన గోదావరిలో వరద తగ్గు తోంది. శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 60వేల క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 2.95 లక్షలు, పార్వతి బ్యారేజీ వద్ద 3.01 లక్షలు, సరస్వతి బ్యారేజీ వద్ద 1.98 లక్షలు, మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద 10.80 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి శాంతించనుంది. భద్రాచలం నుంచి వెళ్తున్న భారీ వరద పోలవరం, ధవళేశ్వరం మీదుగా కడలిలోకి వెళ్లిపోతోంది. 

శ్రీశైలంలోకి 1.51 లక్షల క్యూసెక్కులు 
కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్రలలోనూ వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కృష్ణాలో ఆల్మట్టిలోకి 1.30 లక్షల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్‌లోకి 88,228 క్యూసెక్కుల వరద వస్తోంది. ఆ ప్రాజెక్టుల్లో కాస్త నీటిని నిల్వ చేస్తూ, మిగతా దిగువకు వదులుతున్నారు. జూరాలకు శనివారం ఉద యం నుంచి సాయంత్రందాకా 2.20 లక్షల క్యూసె క్కుల వరదరాగా.. సాయంత్రానికి 1,35,900 క్యూసెక్కులకు తగ్గింది. ఇక్కడ గేట్లు, విద్యుత్‌ సరఫరా ద్వారా కలిపి 1,48,875 క్యూసెక్కులను దిగు వకు విడుదల చేస్తున్నారు. దీనికి సుంకేశుల నుంచి 2,181 క్యూసెక్కులు కలిపి.. మొత్తం 1,51,056 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు ప్రాజెక్టులో నీటి నిల్వ 61.79 టీఎంసీలకు పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రాజెక్టు నిండాలంటే మరో 157 టీఎంసీలు కావాలి. ఇక తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద తగ్గింది. పులిచింతల ప్రాజెక్టులోకి 11,949 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 69.23 టీఎంసీలకు పెరిగింది.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)