Breaking News

డ్రగ్స్‌తో పట్టుబ‍డ్డ టాలీవుడ్‌ హీరో ప్రేయసి!

Published on Mon, 01/29/2024 - 16:56

రంగారెడ్డి: హైదరాబాద్‌ శివారులో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. నార్సింగిలో సైబరాబాద్ పోలీసుల దాడుల్లో డ్రగ్స్‌తో ఓ యువతి.. మరో వ్యక్తి పట్టుబడ్డారు. వాళ్ల నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలో ఆమె ఓ యువహీరో ప్రేయసిగా తేలింది.

ఎస్ఓటీ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగీలో డ్రగ్స్‌ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎస్‌వోటీ బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఓ యువతియువకుడి దగ్గరనుంచి 4 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి ఆ డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. అయితే విచారించే క్రమంలో ఆ యువతి టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్‌ హీరో ప్రేయసి గుర్తించారు.

షార్ట్‌ ఫిల్మ్స్‌తో పేరు దక్కించుకుని వెండితెరపై అవకాశాలు దక్కించుకున్నాడు ఆ యువ హీరో. మొన్న సంక్రాంతికి ఓ అగ్రహీరో చిత్రంలోనూ ఆ హీరో చిత్రంలోనూ  ఆ యంగ్‌ హీరో నటించాడని పోలీసులు చెబుతున్నారు.

రిమాండ్‌ విధింపు
సదరు యువతి మ్యూజిక్‌ టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్‌ అనంతరం ఆమెను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)