Breaking News

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎక్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ 

Published on Fri, 08/25/2023 - 02:12

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్య సంరక్షణ, ఐటీ రంగాలకు హైదరాబాద్‌లో అనువైన వాతావరణం ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌కేర్‌ ఆధారిత టెక్నాలజీ కార్యకలాపాల విస్తరణకు దిగ్గజ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ గురువారం జీహెచ్‌ఎక్స్‌ చీఫ్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఆఫీసర్‌ క్రిస్టీ లియోనార్డ్‌ బృందంతో భేటీ అయ్యారు.

తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో ‘గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ ఎక్సే్ఛంజ్‌ (జీహెచ్‌ఎక్స్‌) ఈ సందర్భంగా ప్రకటించింది. హెల్త్‌కేర్‌ రంగం పురోగతికి అవసరమైన వాతావరణం, మానవ వనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. హెల్త్‌ కేర్, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు చేయూత అందిస్తూనే ఐటీ ఆధారిత కార్యకలాపాలను పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కేటీఆర్‌ తెలిపారు.  

డిజిటల్‌ దిశగా హెల్త్‌కేర్‌ 
ఆరోగ్య సంరక్షణ రంగం పూర్తిగా డిజిటల్‌ దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని, ఇందులో భాగంగా ఆయా కంపెనీలు ఐటీ ఆధారిత సేవలపై విస్తృతంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని జీహెచ్‌ఎక్స్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ సీజే సింగ్‌ తెలిపారు.

హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ కేంద్రం ఏర్పాటు ద్వారా సంస్థ లక్ష్యాలను అందుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ కార్యకలాపాలను 2025 నాటికి మూడింతలు చేసే లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలను చేపడతామని చెప్పారు. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)