Breaking News

HYD: తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్‌.. కారణం ఇదే

Published on Fri, 02/21/2025 - 08:45

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్‌ తాజ్‌ బంజారా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. పన్ను బకాయిలు చెల్లించని నేపథ్యంలో సీజ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్‌ తాజ్‌ బంజారాను జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం ఉదయం సీజ్‌ చేశారు. గత రెండేళ్లుగా హోటల్‌ యాజమాన్యం పన్నులు బకాయిలు చెల్లించకపోవడంతో సీజ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. రూ.1.40కోట్లు పన్ను బకాయిలు ఉన్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు. గడిచిన రెండు సంవత్సరాలుగా హోటల్ నిర్వాహకులు పన్ను బకాయలు చెల్లించలేదు. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి  స్పందన రాలేదని తెలిపారు. ఈ క్రమంలో సీజ్‌ చేసినట్టు తెలిసింది. 

ఇక ఈ ఘటనపై తాజ్‌ హోటల్‌ యాజమాన్యం స్పందించింది. సీజ్‌చేసి వారెంట్‌ ఇష్యూ చేయడంతో హుటాహుటిన హోటల్‌ నిర్వాహకులు స్పందించారు. జీహెచ్‌ఎంసీకి బకాయి పడిన కోటీ 43 లక్షల రూపాయల పన్నులో సగం చెల్లించినట్టు తెలిపారు. మిగతా బకాయిలను వారంలోగా చెల్లించేందుకు ఒప్పుకున్నట్టు స్పష్టం చేశారు. అయితే తాజా బంజారానే కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్‌ కలెక్షన్‌లో భాగంగా డిఫాల్టర్స్‌ అందరికీ నోటీసులు పంపింది జీహెచ్‌ఎంసీ. మూడేళ్లుగా పన్ను చెల్లించనివాళ్లకు వారెంట్స్‌ ఇష్యూ చేశారు. అందులో భాగంగానే తాజ్‌ బంజారాకి కూడా నోటీసులు ఇచ్చారు. రెడ్‌ నోటీస్‌ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితుల్లో సగం పన్ను చెల్లించింది తాజ్ బంజారా యాజమాన్యం.

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో బంజారాహిల్స్‌లోని తాజ్‌ బంజారా కూడా ఒకటి. ఈ హోటల్‌కు సెలబ్రెటీలు ఎక్కువగా వస్తుంటారు. క్రికెటర్లు ఎప్పుడు వచ్చినా ఈ హోటల్‌లోనే ఎక్కువగా బస చేస్తుంటారు. అలాగే దేశంలోని కీలక రాజకీయనేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు. పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది దీని వైపు మొగ్గుచూపుతారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)