Breaking News

GHMC: హైసిటీ పనుల్లో మరో ముంద‌డుగు

Published on Thu, 05/29/2025 - 19:40

సాక్షి, సిటీబ్యూరో:  హై సిటీ (హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) కింద ఇప్పటికే దాదాపు రూ.1740 కోట్ల మేర ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రహదారుల అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసీ.. తాజాగా రెండు ఫ్లై ఓవర్లు, ఒక అండర్‌పాస్‌ పనుల కోసం టెండర్లు పిలిచింది. ఒకే ప్యాకేజీగా ఈ మూడు పనులకు టెండర్లు ఆహ్వానించింది. అంచనా వ్యయం రూ.368 కోట్లు. జూన్‌ 18న టెండర్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటించారు. దీంతో హైసిటీ పనుల్లో మరో అడుగుపడినట్టయింది.  

బంజారాహిల్స్‌ ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వద్ద జీవీకే వైపు రెండు లేన్లతో ఫ్లై ఓవర్, టీవీ 9 జంక్షన్‌ వద్ద రెండు లేన్ల అండర్‌పాస్, మూడు లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులకు ఈ టెండర్లు ఆహ్వానించింది. ఎంపికయ్యే ఏజెన్సీయే సర్వే, డిజైన్‌తో సహ మొత్తం పనులు చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల వరకు ఏవైనా మరమ్మతులు అవసరమైతే చేయాల్సి ఉంటుంది.  

ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌వద్ద నిర్మించే ఫ్లై ఓవర్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3 వైపు నుంచి జీవీకే మాల్‌వైపు వెళ్తుంది. 8.5 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ ఫ్లై ఓవర్‌ క్యారేజ్‌వే 7.5 మీటర్లు ఉండేలా నిర్మించాల్సిందిగా టెండరు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

టీవీ9 జంక్షన్‌ వద్ద రెండు లేన్లతో ఒక అండర్‌పాస్‌ నిర్మిమస్తారు. ఇది ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ నుంచి శ్రీనగర్‌ కాలనీవైపు వెళ్లే వారికి ఉపకరిస్తుంది. పది మీటర్ల వెడల్పుతో నిర్మించే దీంట్లో క్యారేజ్‌వే 7.5 మీటర్లుగా ఉండనుంది. ఫుట్‌పాత్‌లతోపాటు రెండు లక్షల నీటి సామర్ధ్యంతో భూగర్భ సంప్‌ కూడా ఉంటుంది. టీవీ9 జంక్షన్‌ వద్దే  బంజారాహిల్స్‌ ముగ్ధ జంక్షన్‌నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వైపు మూడులేన్లతో మరో ఫ్లై ఓవర్‌ను కూడా నిర్మిస్తారు. ఈ ఫ్లైఓవర్‌ వెడల్పు 12 మీటర్లు కాగా, క్యారేజ్‌వే 11 మీటర్లు. ఈ ప్యాకేజీలోని మూడు పనుల్లోనూ ప్రయాణ మార్గం ఒకేవైపు ఉంటుంది. 

రీ టెండర్‌.. 
విరించి హాస్పిటల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే పిలిచిన టెండర్లకు స్పందన లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ తాజాగా రెండో సారి టెండర్లు పిలిచింది. ఈ పని అంచనా వ్యయం రూ. 150 కోట్లు. జూన్‌ 11 ఈ టెండర్ల దాఖలుకు చివరితేదీగా పేర్కొన్నారు.  

రూ. 5,942 కోట్ల పనులకు అనుమతులు.. 
రాష్ట్ర ప్రభుత్వం హై సిటీ కింద వివిధ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రహదారుల అభివృద్ధి, తదితర పనుల కోసం రూ. 5,942 కోట్ల పనులకు గత డిసెంబర్‌లో పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఐదు ప్యాకేజీల్లో 32 పనుల్ని 23 ప్రాజెక్టుల కింద టెండర్లు పిలిచేందుకు జీహెచ్‌ఎంసీకి అనుమతినిచ్చింది. రద్దీ ఎక్కువ ఉండే ఈ ప్రాంతాల్లో పనులు త్వరితంగా పూర్తయ్యేందుకు స్టీల్‌ ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

గతంలో  టెండర్లు పిలిచినవి.. 
ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద ఐఎస్‌బీ నుంచి డీఎల్‌ఎఫ్‌ రోడ్‌ వరకు మొదటి వరుస ఫ్లై ఓవర్‌.  
ఐఎస్‌బీ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు  రెండో వరుసలో మరో ఫ్లై ఓవర్‌.  
డీఎల్‌ఎఫ్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ రోడ్‌ వైపు వెళ్లేందుకు రెండో వరుసలో ఫ్లై ఓవర్‌.  
గచ్చిబౌలి నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు ఆరులేన్లతో అండర్‌పాస్‌.

ఖాజాగూడ జంక్షన్‌ వద్ద.. 
నానక్‌రామ్‌గూడ – టోలిచౌకి రోడ్‌ వరకు ఫ్లై ఓవర్‌. టోలిచౌకి రోడ్‌– బయోడైవర్సిటీ వరకు అండర్‌పాస్‌. 
జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ జంక్షన్‌వద్ద ఒక అండర్‌పాస్‌. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36 నుంచి కేబీఆర్‌ పార్కు ఎంట్రెన్స్‌ వరకు మొదటి వరుస ఫ్లై ఓవర్‌. 
యూసుఫ్‌గూడ రోడ్‌ నుంచి రోడ్‌నెంబర్‌ 45 వరకు రెండో వరుస ఫ్లై ఓవర్‌. కేబీఆర్‌ పార్కు ఎంట్రెన్స్‌ జంక్షన్‌ వద్ద జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ జంక్షన్‌ నుంచి క్యాన్సర్‌ హాస్పిటల్‌ రోడ్‌ వరకు అండర్‌పాస్‌. 
బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 2 నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ రోడ్‌ వరకు ఫ్లై ఓవర్‌. ముగ్ధ జంక్షన్‌ వద్ద కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ రోడ్‌ నుంచి పంజగుట్ట రోడ్‌ వరకు అండర్‌పాస్‌.  

చ‌ద‌వండి: హైద‌రాబాదీల‌కు అందుబాటులో మ‌రో ఫ్లై ఓవర్

రోడ్‌ నెంబర్‌–45 జంక్షన్‌ వద్ద ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ రోడ్‌ వరకు అండర్‌పాస్‌. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ రోడ్‌ నుంచి రోడ్‌నెంబర్‌ 45 వరకు ఫ్లై ఓవర్‌. ఫిల్మ్‌నగర్‌ జంక్షన్‌ వద్ద మహారాజా అగ్రసేన్‌ జంక్షన్‌ నుంచి రోడ్‌నెంబర్‌ 45 జంక్షన్‌ వరకు అండర్‌పాస్‌.  

ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ నుంచి మహారాజా అగ్రసేన్‌ జంక్షన్‌ రోడ్‌ వరకు ఫ్లై ఓవర్‌. మహారాజా అగ్రసేన్‌ జంక్షన్‌ వద్ద క్యాన్సర్‌ హాస్పిటల్‌ రోడ్‌ నుంచి ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ వరకు అండర్‌పాస్‌. ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12 వరకు ఫ్లై ఓవర్‌. క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వద్ద కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ నుంచి మహారాజా అగ్రసేన్‌ జంక్షన్‌ రోడ్‌ వరకు అండర్‌పాస్‌. మహారాజా అగ్రసేన్‌ జంక్షన్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10 వరకు ఫ్లై ఓవర్‌.   

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు