Breaking News

Hyderabad: అంతా అటెన్షన్‌

Published on Thu, 08/14/2025 - 09:12

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉందని కమిషనర్‌  ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. బుధవారం జీహెచ్‌ఎంసీ హెడ్‌ ఆఫీస్‌లోని కంట్రోల్‌ రూంను ఆయన  తనిఖీ చేశారు. ఫిర్యాదులపై ఆరా తీశారు. కంట్రోల్‌ రూం కార్యకలాపాలను సమీక్షించారు. 24్ఠ7 అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్‌ రూం సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  
‘నగరంలో భారీ వర్షాలున్నాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో  జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశాం. ఉన్నత అధికారులను హెడ్‌ క్వార్టర్లో ఉండాలని ఆదేశించాం. జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనిస్తూ అపసవ్యతలను చక్కదిద్దుతున్నారు.  లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు శిథిలావస్థకు చేరిన భవనాలలో నివాసం ఉంటున్న  ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.   

పౌరుల ఫిర్యాదులపై స్పందించేందుకు, సహాయక కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రభావవంతంగా నిర్వహించేందుకు  పోలీస్, హైడ్రా, విద్యుత్, జలమండలి, మెట్రో రైలు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో  ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.  రిలీఫ్‌ కార్యకలాపాలను డిప్యూటీ కమిషనర్, స్థానిక తహసీల్దార్లు చూసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీకి  కంట్రోల్‌ రూమ్‌తో పాటు నేరుగా, వివిధ మాధ్యమాల ద్వారా  అందుతున్న  ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తున్నాం. నాలాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాం. ప్రజలు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లకూడదు’ అని కమిషనర్‌ సూచించారు. 

ట్రాఫిక్‌ ఫ్లో సజావుగా సాగేలా చర్యలు.. 
నగరంలో వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశం ఉంటుందని కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ చెప్పారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. మ్యాన్‌హోళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దు అని కమిషనర్‌ జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా సిబ్బందికి,  ప్రజలకు సూచించారు. మ్యాన్‌హోళ్లపై ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. 

ట్రాఫిక్‌ చోకింగ్‌ పాయింట్లపై ప్రత్యేక  దృష్టి సారించామని,  ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా పోలీస్, హైడ్రా తో సమన్వయం చేసుకుంటున్నామన్నారు.  ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా కృషి చేస్తున్నామని చెప్పారు.  కొన్ని ప్రాంతాల్లో భూగర్భ సంపుల నిర్మాణంతో వాటర్‌ లాగింగ్‌ కాకుండా చేసినందువల్ల  ట్రాఫిక్‌ జామ్‌లు తగ్గాయని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో భూగర్భ సంపులను నిర్మిస్తామని కమిషనర్‌ తెలిపారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)