Breaking News

కారిడార్ పనులు వేగంగా పూర్తి చేయాలి: ఆర్వీ కర్ణన్

Published on Tue, 12/30/2025 - 18:10

సాక్షి హైదరాబాద్: నల్గొండ ఎక్స్ రోడ్–ఓవైసీ జంక్షన్ కారిడార్‌ను వచ్చేఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా ప్రారంభించేలా పనులు త్వరతగతిన పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. నల్గొండ ఎక్స్ రోడ్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్  కారిడార్ పనుల పురోగతిని మంగళవారం  ఆర్వీ కర్ణన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించేందుకు ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,530 మీటర్ల పొడవు గల ప్రధాన ఫ్లైఓవర్‌ను రూ.620 కోట్ల అంచనా వ్యయంతో EPC (Engineering, Procurement, Construction) విధానంలో నిర్మిస్తున్నారు. దీని పనుసు ఇప్పటివరకు సుమారు 80 శాతం  పూర్తయ్యాయని ఈ సందర్భంగా కమిషనర్‌కు వివరించారు. వీటి వివరాలు తెలుసుకున్న కమిషనర్ కర్ణన్ మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని తెలిపారు.

సైదాబాద్ నుంచి దోబీఘాట్ జంక్షన్ వరకు ఉన్న  కీలక ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్‌కు అవసరమైన అనుమతులు తీసుకుని పనులు వేగంగా కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా కారిడార్ ప్రారంభించిన అనంతరం ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు  చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ  బి. గోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)