Breaking News

శంషాబాద్‌: 12 కోట్ల విదేశీ గంజాయి పట్టివేత

Published on Sat, 09/20/2025 - 15:11

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయిని అధికారులు పట్టుకున్నారు. దాని విలువ రూ.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది.  

డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ జోన్ అధికారులు సమాచారం ఆధారంగా.. దుబాయ్‌ నుంచి వచ్చిన భారతీయ మహిళా ప్రయాణికురాలిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె బ్యాగేజీ నుంచి 6 కేజీల హైడ్రోపోనిక్‌ గంజాయి లభించింది. అయితే తన మరొక లగేజ్‌ తప్పిపోయిందని ఆమె ఫిర్యాదు చేయగా.. అది ఇవాళ హైదరాబాద్‌కి చేరింది. అందులోనూ మరో 6 కేజీల గంజాయి బయటపడింది. 

డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేసిన ఆ మొత్తం 12 కేజీల హైడ్రోపోనిక్‌ గంజాయి విలువ రూ.12 కోట్ల దాకా ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో ఆ ప్రయాణికురాలిని ఎన్‌డీపీఎస్ చట్టం-1985 కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

హైడ్రోపోనిక్‌ గంజాయి అంటే.. 
హైడ్రోపోనిక్‌ గంజాయి అనేది మట్టి లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పెంచే గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందిస్తారు. కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఇది సాధారణ గంజాయితో పోలిస్తే మత్తు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే THC (టెట్రాహైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటంతో, ఇది కొకైన్‌తో సమానమైన మత్తు కలిగిస్తుంది. 

హైడ్రోపోనిక్‌ గంజాయి విదేశాల నుంచి.. ప్రధానంగా థాయ్‌లాండ్ నుంచి అక్రమంగా భారత్‌కు రవాణా అవుతుంటుంది. కొన్ని దేశాల్లో గంజాయి సాగుపై నిషేధం లేకపోవడం వల్ల స్మగ్లింగ్ ముఠాలు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. ఈ గంజాయి ధర ఒక్క కిలోకు రూ. కోటి వరకు పలుకుతోంది. మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి గంజాయిని రవాణా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలోనే శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల రూ.53 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది.

శిక్ష ఏంటంటే..
హైడ్రోపోనిక్‌ గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయానికి భారతదేశంలో కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ నేరం ఎన్డీపీఎస్‌ చట్టం 1985 (Narcotic Drugs and Psychotropic Substances Act) ప్రకారం శిక్షించబడతారు. ఈ చట్టం కింద బెయిల్ పొందడం చాలా కష్టం. నేరం తీవ్రతను బట్టి కోర్టు విచారణ జరుగుతుంది.

గంజాయి రవాణా, విక్రయానికి.. 10–20 సంవత్సరాల జైలు + రూ. 1–2 లక్షల జరిమానా విధిస్తారు. మళ్లీ అదే నేరం చేస్తే గనుక.. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే జీవిత ఖైదూ విధించవచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)