Breaking News

కొండాయిలో నిండా విషాదమే!

Published on Sun, 07/30/2023 - 01:29

ఏటూరునాగారం: భారీ వర్షాలు, జంపన్న వాగు వరదతో తీవ్రంగా దెబ్బతిన్న ములుగు జిల్లా ఏటూ రునాగారం మండలం కొండాయి ఇంకా విషాదంలోనే ఉండిపోయింది. వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన 8 మంది గ్రామస్తుల అంత్య క్రియలు కుటుంబ సభ్యుల రోదనల మధ్య శనివా రం పూర్త య్యాయి. గ్రామంలో మట్టి గోడలతో ఉన్న 80 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. గ్రామమంతా నీట మున గడంతో బియ్యం, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తు వులు తడిసి పాడైపోయాయి. ఇళ్లలో, బయట ఎక్క డ చూసినా బురదతోనే నిండిపోయి కనిపిస్తోంది.

బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్‌
జంపన్న వాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోవడంతో కొండాయి గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పారిశుధ్య చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉంది. భారీగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో.. మూడు రోజులుగా విద్యుత్‌ సరఫరాలేక చీకటిలోనే మగ్గుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బోట్లు ఉన్నంత సేపు కాస్త రాకపోకలు, అవసరమైన సరుకులు అందుతున్నాయి. ఆ బృందాలు వెళ్లిపోతే.. అడవి గ్రామంలో చిక్కుకుపోయినట్టేనని గ్రామస్తులు వాపోతున్నారు.

మరణంలోనూ వీడకుండా..
కొండాయి గ్రామస్తులు రషీద్, ఆయన భార్య కరీమా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వరద దాటుతుండగా కొట్టుకుపోయారని.. చనిపోయేంత వరకు వారు కలిసే ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. మృతదేహాలు కూడా చేయిపట్టుకునే ఉన్నాయని తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు
విపత్కర పరిస్థితిలో చిక్కుకున్న కొండాయి గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకుంటామని, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందజేస్తామని గిరిజన 
సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. తక్షణ సాయంగా రూ.25 వేలు అందిస్తున్నట్టు చెప్పారు. శనివారం అధికారులతో కలసి ఆమె బోట్లలో కొండాయి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. వరద బాధితులను ఓదార్చారు. ఆస్తి, పంటల నష్టంపై అధికారులు సర్వే చేసి నివేదిక ఇస్తారని.. అనంతరం తగిన సాయం అందిస్తామని తెలిపారు.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు