పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

Published on Mon, 06/22/2026 - 12:59

విదేశీ పళ్లు..  ప్రస్తుతం సూపర్‌ మార్కెట్ల నుంచి తోపుడు బండ్ల వరకు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. అయితే, ప్రతి పండు వెనుక ఉండే ‘కెమికల్‌ కథ’ మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదా దెబ్బ తీయడంలో కీలకపాత్ర పోషిస్తోందన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో విదేశీ పండ్ల వినియోగం 5 ఏళ్లలో బాగా పెరిగింది. వ్యవసాయ మరియు ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) లెక్కల ప్రకారం 2024–25లో రూ.8,500 కోట్ల విలువైన పండ్లు దిగుమతి అయ్యాయి. అమెరికా యాపిల్స్, న్యూజిలాండ్‌ కివీ, చిలీ చెర్రీలకు డిమాండ్‌ ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్‌

3, 4తో మొదలైతే ప్రమాదం... 9తో మొదలైతేనే భద్రం

  • పండ్లపై ఉండే ప్రైస్‌ లుక్‌–అప్‌ (పీ­ఎల్‌­యూ) కోడ్‌లోనే అసలు రహస్యం ఉంది.

  • 4 అంకెలు.. 3 లేదా 4తో మొదలు: రసాయన ఎరువులతో పండించినవి.

  • 5 అంకెలు.. 9తో మొదలు: 100 శాతం సేంద్రియం.

  • 5 అంకెలు..  8తో మొదలు: జన్యు మార్పి­డి (జీఎమ్‌వో) పండ్లు. భారత్‌లో నిషేధం.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమంటోంది అంటే..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం రసాయన అవశేషాలతో కాలేయం, కిడ్నీలు దెబ్బ తింటాయి. పిల్లల్లో హార్మోన్ల సమస్యలు, పెద్దల్లో క్యాన్సర్‌ వస్తాయి. అమెరికా యాపిల్‌ను 6 నెలలు నిల్వ ఉంచేందుకు ‘డైఫినైల్‌ అమైన్‌’ వాడతారు. ఇది యూరప్‌లో నిషేధం.

స్టిక్కర్‌ కోడ్‌ చెక్‌ చేయండి
కొనేముందు 5 సెకన్లు కేటాయించి స్టిక్కర్‌ చూడండి. 9తో మొదలయ్యే కోడ్‌ ఉంటేనే కొనండి. స్టిక్కర్‌ లేకుంటే ముట్టుకోవద్దు. గర్భిణులు, పిల్లలకు కెమికల్‌ పండ్లు వద్దని నిమ్స్‌ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు ఏవి?
భారత ఆహార భద్రత, ప్రమా­ణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రకారం కాల్షియం కార్బైడ్‌తో మాగబెడితే రూ.10 లక్షల జరిమానా, 6 నెలల జైలు విధించాలి. కానీ దిగుమతి పండ్లపై తనిఖీలు లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)