Breaking News

ఐఏఎస్‌నంటూ నమ్మించి వివాహం

Published on Thu, 07/11/2024 - 09:05

నిజాంపేట్‌: ఐఏఎస్‌ అధికారినని నమ్మించి ఓ మహిళను వివాహం చేసుకోవడమే కాకుండా భారీ మొత్తంలో నగదును తీసుకుని మోసం చేసిన వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిజాంపేట్‌ శ్రీనిత్య రెసిడెన్సీకి చెందిన నల్లమోతు సందీప్‌కుమార్‌(34) సివిల్స్‌ ఎగ్జామ్‌లో ట్రాపర్‌గా నిలిచి కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా పోస్టింగ్‌ వచి్చన్నట్లు ఇరుగుపొరుగును నమ్మించాడు. అదే విధంగా ఎనీ్టఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నుంచి ఎండీ రేడియాలజీ పూర్తి చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. 

ఇది నిజమని నమ్మిన కర్నూలు జిల్లాకు చెందిన అరిమిల్లి శ్రావణి అతన్ని వివాహం చేసుకుంది. పెళ్‌లైన తరువాత సైతం తీరు మార్చుకోని సందీప్‌కుమార్‌ తన బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.40 కోట్లు ఉన్నాయని, ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లించకపోవడంతో ఫ్రీజ్‌ అయ్యాయని, రూ.2 కోట్లు కడితే విడుదలవుతాయని భార్యను నమ్మించాడు. ఇది నిజమని నమ్మిన శ్రావణి తన బంధువులు, స్నేహితుల వద్ద రూ.2 కోట్లు అప్పుగా తీసుకుని ఆడపడుచులక్ష్మి సాహితి, అత్తమామలు మాలతి, విజయ్‌కుమార్‌ల బ్యాంక్‌ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్‌ చేయించింది. అంతే కాకుండా శ్రావణి నగలను సైతం సందీప్‌ కుదువ పెట్టి జల్సాలు చేశాడు.

 నకిలీ గుర్తింపుతో మోసం చేశారని గ్రహించిన బాధితురాలు భర్త, అత్తమామలు, ఆడపడచులపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సందీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ ఉపేందర్, ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బందిలను అభినందిస్తూ ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు రివార్డులను ప్రకటించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)