Breaking News

పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి

Published on Thu, 02/06/2025 - 21:19

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం జరిగింది. హయత్‌నగర్‌ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిని స్కూల్‌ బస్సు కింద పడి  ప్రాణాలు కోల్పోయింది. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా వ్యాన్‌ను డ్రైవర్‌ రివర్స్‌ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇంజనీరింగ్‌ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎన్‌సీడీ రాయల్‌ పెవిలియన్‌ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్‌ మండల కేంద్రానికి చెందిన శ్రీహర్ష(19)కు దొంతన్‌పల్లిలోని ఇక్ఫాయ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ సీటు వచ్చింది. దీంతో అతని తల్లి మోకిలతండాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటూ కొడుకును చదివిస్తోంది. శ్రీహర్ష నిత్యం బైక్‌పై కాలేజీకి వెళ్లివస్తుంటాడు.

ఇదిలా ఉండగా బుధవారం కళాశాల ముగిసిన తర్వాత ఉప్పల్‌కు చెందిన క్లాస్‌మేట్‌ హర్షనందన్‌(19)ను తీసుకుని ఫ్రెషప్‌ అయ్యేందుకు మోకిలతండాకు వచ్చారు. సుమారు గంటపాటు రూంలో గడిపిన అనంతరం హర్షనందన్‌ను కాలేజీ వద్ద వదిలిపెట్టేందుకు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్‌సీడీ రాయల్‌ పెవిలియన్‌ సమీపంలో కొండకల్‌ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఏపీ మోడల్‌ పాఠశాల బస్సు వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్‌ నడుపుపుతున్న శ్రీహర్షకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షనందన్‌ పాక్షిక గాయాలతో బయటపడ్డాడు. అతన్ని శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు శ్రీహర్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)