Breaking News

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

Published on Thu, 10/16/2025 - 07:36

భిక్కనూరు/బోనకల్‌: రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చిన టిప్పర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద ఎన్‌హెచ్‌ 44పై బుధవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లికి చెందిన మెరుగు కిషన్‌ (54) ఆదిలాబాద్‌ జిల్లా రణదీవ్‌నగర్‌లో చర్చి పాస్టర్‌గా పనిచేస్తుండగా, ఆయన తల్లిదండ్రులు కామా రెడ్డిలో ఉంటున్నారు. 

కిషన్‌ తన కుమార్తె జాస్లీన్‌ (30)ను ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన ఆగ మని ప్రకాశ్‌కు ఇచ్చి వివాహం చేశాడు. ప్రకాశ్‌ చింతకాని మండలం చిన్న మండవలో పాస్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జోయల్‌ ప్రకాశ్‌ (4), జాడ్సన్‌ (3 నెలలు). కామారెడ్డిలో ఉంటున్న తన నానమ్మ, తాతయ్య వద్దకు జాస్లీన్‌ తన ఇద్దరు కుమారులతో కలిసి కొద్ది రోజుల క్రితం వచ్చింది. కిషన్‌ సైతం తన తల్లి దండ్రుల వద్దకు వచ్చాడు. జాస్లీన్‌ తన చిన్న కుమారుడు జాడ్సన్‌కు టీకా వేయించేందుకు భిక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశ వర్కర్‌గా పనిచేస్తున్న తమ బంధువు వద్దకు తండ్రి, పెద్ద కుమారుడితో కలిసి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై బయల్దేరింది. వారి వాహనం జంగంపల్లి వద్దకు చేరుకోగానే రాంగ్‌రూట్‌లో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది.

 దీంతో నలుగురు రోడ్డుపై పడిపోయారు. కిషన్, జాస్లీన్‌ అక్కడి కక్కడే మృతి చెందగా, చిన్నారులు జోయల్‌ ప్రకాశ్, జాడ్సన్‌ను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ డ్రైవర్‌ రాజిరెడ్డిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)