Breaking News

నలుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల అరెస్ట్‌.. కారణం ఇది..

Published on Wed, 01/24/2024 - 12:59

సాక్షి, కరీంనగర్: కరీంనగర్‌ జిల్లాలో కార్పొరేటర్ల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, భూ కబ్జాలకు సంబంధించిన కేసులో భాగంగానే వారికి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. కరీంనగర్‌లో కార్పోరేటర్స్ వరుస అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18వ డివిజన్‌కు చెందిన సుధగోని కృష్ణాగౌడ్, 21వ డివిజన్‌కు చెందిన జంగిల్ సాగర్, 41వ డివిజన్‌కు చెందిన భూమాగౌడ్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. 

అయితే, ఇప్పటికే భూ కబ్జా కేసులో 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములుతో పాటు, బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక.. తోట రాములు, చీటీ రామారావును ఇప్పటికే 24 గంటల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తోట రాముడు, చీటి రామారావుపై హైదరాబాద్ ప్రజాదర్బార్‌లో రాజిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన రెండు గుంటల భూమిని కబ్జా చేసి, హద్దులు మార్చాలంటూ 2019 నుంచి పోరాటం చేస్తున్నట్టు రాజిరెడ్డి ఫిర్యాదులో తెలిపారు. 

రాజిరెడ్డితో సుమారు 120 మంది నుంచి భూ అక్రమ వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ భూ కబ్జాలు, ఫైనాన్షియల్ అఫెన్సెన్‌పై పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి విచారణ చేపట్టారు. మరోవైపు కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో కార్పోరేటర్స్ వరుస అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)