Breaking News

హైకోర్టుకు కొత్తగా.. నలుగురు జడ్జీలు

Published on Thu, 01/23/2025 - 05:29

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సిటీ సివిల్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యార, సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జి నర్సింగ్‌రావు నందికొండ, హైకోర్టు రిజి్రస్టార్‌ జనరల్‌ తిరుమలాదేవి ఈద, హైకోర్టు రిజి్రస్టార్‌ (అడ్మినిస్ట్రేషన్‌) మధుసూదన్‌రావు బొబ్బిలి రామ­య్య పేర్లను ఈ నెల 11న ఢిల్లీలో భేటీ అయిన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 

వీరంతా 2012లో జిల్లా జడ్జిలుగా ఎంపికైనవారు కావడం గమనార్హం. కాగా న్యాయాధికారుల కోటా­లో వీరి ఎంపిక జరిగింది. తిరుమలాదేవి బాధ్య­త­లు చేపట్టిన నాటి నుంచి 2026 జూన్‌ 1 వరకు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. మిగతా ముగ్గురు రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తారని.. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ ఈ నెల 25న కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా, ప్రస్తుతం 26 మంది ఉన్నారు. ఈ నలుగురితో కలిపి జడ్జిల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలు ఉండగా, వీటి భర్తీ కోసం న్యాయవాదులు ఎదురుచూస్తున్నారు.  

  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు