Breaking News

సాంకేతిక సౌరభం

Published on Thu, 06/26/2025 - 03:22

వనపర్తిటౌన్‌: వనపర్తి ఎడ్యుకేషన్‌ హబ్‌కు కేరాఫ్‌గా మారింది. ఇందుకు సంస్థానాదీశుల కాలంలోనే బీజం పడింది. పాఠశాల విద్య, సాంకేతిక విద్యకు వనపర్తి రాజులు జీవం పోశా రు. 1936, అంతకంటే ముందు నిజాం ప్రభువు హయాంలో హైదరాబాద్‌ రాష్ట్రంలో పది పాఠశాలలు ఉంటే.. అందులో ఒకటి వనపర్తిలో (పాత జూనియర్‌ కళాశాల) ఏర్పాటు చేసేలా సంస్థానాదీశులు చొరవ తీసుకున్నారు. అప్పట్లో నిరుపేద కుటుంబాలకు చెందిన అన్ని వర్గాల విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్‌షిప్‌లు అందించే వారు. 

1959లో సంస్థానాదీశుడు రాజా రామేశ్వర్‌రావు హయాంలో దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాలలో చదువుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. నేపాల్, జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి సాంకేతిక విద్య ను అభ్యసించారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్‌ కోర్సుల్లో 30 నుంచి 40 మందికి సాంకేతిక విద్య అందించారు. 

రాజా రామేశ్వర్‌రావు ఔదార్యం.. 
ఈ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను రాజా రామేశ్వర్‌రావు 1959 నుంచి 1971 వరకు సమర్థవంతంగా నడిపారు. ఆ తర్వాత 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజప్రాసాదాన్ని (కళాశాల భవనం) ఒక్క రూపాయి ఆశించకుండా ప్రభుత్వానికి అందజేశారు. అప్పట్లో రాజా వారి నిర్ణయం సంచలనమని నేటికీ చర్చించుకుంటారు.  

ఆరు కోర్సులతో.. 
పాలిటెక్నిక్‌ విద్య ప్రభుత్వ అదీనంలోకి వచ్చాక మొదట్లో ఉన్న మూడు కోర్సులతో పాటు సీసీపీ, డీ ఫార్మసీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కోర్సులతో కళాశాల కొనసాగుతోంది. 1,200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. కృష్ణదేవరాయ పాలిటెక్నిక్‌ పేరుతో రాజప్రాసాదం విరాజిల్లుతోంది.  

55 ఏళ్ల తర్వాత మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల.. 
వనపర్తిలో సాంకేతిక విద్యకు అడుగులు పడిన 55 ఏళ్ల తర్వా త జిల్లాలోని పెబ్బేరుకు మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరైంది. ఇందులో రెండు కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం 300 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రాజుల కాలంలోనే మోడల్‌ బేసిక్‌ ప్రాక్టిసింగ్‌ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. 

స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్య్ర అనంతరం కొన్నేళ్ల పాటు వనపర్తి పాతబజార్‌లోని హనుమాన్, శంకర్‌గంజ్‌లోని దేవాలయాల్లో బ్రాహ్మణులు నిరుపేదలకు చదువులు చెబుతూ జీవ నం సాగించేవారు. సంస్థానాధీశుల కాలం నుంచే వనపర్తిలో విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడ పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఉంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు విద్యాపరంగా చైతన్యవంతులు అని గుర్తింపు వచి్చంది.  

ఉపాధి అవకాశాలు మెండు.. 
ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ శాఖ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌ విద్య విద్యార్థులకు వరంలాంటిది. పాలిటెక్నిక్‌ విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేట్‌ కంపెనీల్లో రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించొచ్చు. డిప్లామాతోనే విద్యార్థులు స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్‌ విద్యతో చేకూరుతుంది. త్వరలో జరిగే పాలిసెట్‌ కౌన్సిల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.  – జగన్, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్, వనపర్తి 

విద్యాపర్తిగా గుర్తింపు.. 
రాజుల కాలం నుంచే విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతిక విద్యలో వనపర్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌ జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి విద్యనభ్యసించారు. జిల్లాలోని పెబ్బేరులో పదేళ్ల క్రితం మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలతో పాటు ప్రైవేట్‌ రంగంలోనూ సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది.   – టీపీ కృష్ణయ్య, విద్యావేత్త, వనపర్తి 

ఉన్నత స్థాయికి చేర్చింది..  
వనపర్తిలో విద్యనభ్యసించిన ఎంతోమంది అత్యున్నత స్థాయికి చేరారు. నిజాం కాలం నుంచి వచ్చిన ప్రతి విద్యాసంస్థ ప్రారంభం వెనుక ప్రజా పోరాటాలు, ప్రజల ఆకాంక్షలు ఇమిడి ఉన్నాయి. రాజరికం నుంచి ప్రస్తుత రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యావికాసంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే వనపర్తి అగ్రగామిగా నిలుస్తుంది. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సైంటిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వంటి వారితో పాటు ప్రతి రంగంలో వనపర్తి అక్షర జ్ఞానం కనిపిస్తుంది.   – గణేశ్‌కుమార్, ఉపాధ్యాయుడు, వనపర్తి 

విద్యకు పెద్దపీట.. 
నిజాం కాలంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అంతే కాకుండా కులమతాలకు అతీతంగా అందరికీ విద్య అందించడంలో వనపర్తి ఆది నుంచీ అడుగులు వేస్తోంది. సాంకేతిక విద్య అభ్యసించేందుకు నేపాల్, జర్మనీ, జపాన్‌ వంటి దేశాల నుంచి వచ్చే వారు. సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు రాజా రామేశ్వర్‌రావు తన రాజప్రాసాదాన్ని ప్రభుత్వానికి ఉదారంగా ఇవ్వడం విద్యా విస్తరణపై వనపర్తి సంస్థానాధీశులకు ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది.  – భైరోజు చంద్రశేఖర్, వనపర్తి  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)