Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం?

Published on Tue, 06/10/2025 - 08:56

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు సిట్‌ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్ప డం మాట అటుంచితే.. ఆయనే సిట్‌ అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఆదివారం అమెరికా నుంచి తిరిగి వచ్చిన ప్రభాకర్‌రావు సోమవారం తన న్యాయవాదితో కలిసి సిట్‌ విచారణకు హాజరయ్యారు. 

ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ రెండో అంతస్తులో ఉన్న సిట్‌ కార్యాలయానికి ప్రభాకర్‌రావు చేరుకున్నారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్, సిట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి నేతృత్వంలోని బృందం ప్రభాకర్‌రావును ప్రశ్నించింది. మధ్యాహ్నం గంటసేపు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చి, రాత్రి 7.30 గంటల వరకు ఆయన్ను విచారించారు. ప్రభాకర్‌రావు చెప్పిన వివరాలను ఆయన స్టేట్‌మెంట్‌గా రికార్డు చేసుకున్నారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌రావుకు పోలీసులు సూచించారు.

వారితో వృత్తిగత బంధమే..
డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు తనవద్ద పని చేశారని, విధి నిర్వహణలో భాగమైన మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారాలను మాత్రమే తాము పర్యవేక్షించామని ప్రభాకర్‌రావు చెప్పినట్లు తెలిసింది. తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు తదితరులతో తనకు వృత్తిపరమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టంచేసినట్లు సమాచారం. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్‌ఐబీ కార్యాలయంలో హార్డ్‌డిస్క్‌ల ధ్వంసంపైనా అధికారులు ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. ఆ నెల 30న సాయంత్రం 4 గంటలకే తాను ఎస్‌ఐబీ చీఫ్‌ పోస్టుకు రాజీనామా చేశానని, ఆ వెంటనే కార్యాలయాన్ని విడిచిపెట్టి వెళ్లానని చెప్పిన ప్రభాకర్‌రావు... ఆ తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో తనకు ఎలా సంబంధం ఉంటుందని సిట్‌ అధికారు లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసి, కొత్తవి పెట్టమన్నది ఎవరు? అని పోలీసులు ప్రశ్నించగా... ఆయన నుంచి సరైన స్పందన రాలేదు. ఈ విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్‌ చేశారు. బుధవారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ప్రభాకర్‌రావుకు నోటీసులు జారీ చేశారు. 2023 ఎన్నికల సమయంలో వినియోగించిన రెండు సెల్‌ఫోన్లు, ట్యాబ్, మ్యాక్‌బుక్, ల్యాప్‌టాప్‌ తీసుకువచ్చి అప్పగించాలని ఆదేశించారు.

ట్యాపింగ్‌కు నేను అనుమతివ్వలేదు
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా సిట్‌ అధికారులు ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. అయి తే, ఆయన మాత్రం ఈ కేసుతో తనకు సంబంధమే లేదని వాదించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకేం సంబంధం? ఏయే ఫోన్లు ట్యాప్‌ చేయాలి? ఎంత కాలం చేయాలి? ఎందుకు చేయాలి? అనేది ఖరారు చేయడానికి, ఆ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ కమి టీలో సభ్యులుగా ఉండే ఉన్నతాధికారులను ఎందుకు వదిలేశారు?’ అని ప్రభాకర్‌ రావు ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయా అధికారులను విచారించి, వాంగ్మూ లాలు నమోదు చేశామని పోలీసులు చెప్పగా... ట్యాపింగ్‌కు అనుమతి ఇచ్చింది వారేనని.. తనకు ఏమాత్రం సంబంధం లేదని వాదించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్‌ జంట’ కేసులో మరో ట్విస్ట్‌

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)