Breaking News

పారిశుధ్య కార్మికులతో కేటీఆర్‌ భేటీ

Published on Tue, 01/02/2024 - 02:12

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు సోమవారం పారిశుధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కార్మికులతో ముచ్చటిస్తూ సహపంక్తి భోజనం చేశారు. సెల్పిలు దిగారు. కాగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పారిశుధ్య కార్మికులు కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఏళ్ల తరబడి చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని చెప్పారు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కలి్పంచడంతో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమకూ మెడికల్‌ లీవ్‌ సౌకర్యం ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పారిశుధ్య కార్మికులకు మూడు పర్యాయాలు వేతనం పెంచిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. సమస్యలను మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

నేతలు, కార్యకర్తల స్వాగతం 
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు, సెల్పిలు దిగారు. సుమారు ఐదు గంటల పాటు తెలంగాణ భవన్‌లో గడిపిన కేటీఆర్‌ కార్యకర్తలను కూడా కలిశారు.

శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రాజీవ్‌ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, నగేష్, టీఆర్‌ఎస్వీ నాయకులు శ్రీకాంత్‌ గౌడ్, తుంగ బాలు, కాటం శివ తదితరులు కేటీఆర్‌ను కలిశారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి