Breaking News

పరిశ్రమల భూములు పప్పు బెల్లాలకు అమ్మేస్తారా?

Published on Sun, 11/23/2025 - 04:15

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామికవాడల్లోని సుమారు పది వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం పప్పు బెల్లాలకు అమ్ముకునే కుట్రకు తెరలేపిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించా­రు. హైదరాబాద్‌ ఇండ్రస్టియల్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్మే­షన్‌ పాలసీ (హిల్ట్‌ పి).. హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ లూటింగ్‌ పాలసీగా మారుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల అడ్డగోలు అమ్మకం మీద దృష్టి పెట్టిన ము­ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. 

ఎకరాలు, గుంటలు, గజాలను కూ­డా వదిలిపెట్టకుండా అడ్డగోలుగా భూముల అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో భూము­ల అమ్మకంపై ప్రవచనాలు వల్లించిన రేవంత్‌.. ఇప్పు­డు భవిష్యత్తు అవసరాల­కు కూడా మిగలకుండా అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. ‘రాష్ట్ర బడ్జెట్‌తో పోలిస్తే ప్రస్తుత కుంభ­కోణం రెండు రెట్లు పెద్దది. రెండు నెలల్లో రూ.5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్‌ సర్కా­రు స్కెచ్‌ వేసింది..’అని ఆరోపించారు. 

రూ.లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు ‘హిల్ట్‌ పి’తో ప్రభుత్వం తెరలేపిన విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు కూడా అంగీకరించాడని పేర్కొన్నారు. కొత్త పాలసీపై ప్రభుత్వాని­కి నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని సవాల్‌ చేశారు. శనివా­రం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. తాను లేవనెత్తే ఎనిమిది అంశాలపై ప్రభుత్వం సూటిగా సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

ఎస్‌ఆర్‌ఓ రేటునే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? 
‘సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయం (ఎస్‌ఆర్‌ఓ) ధరలతో పోలిస్తే టీజీఐఐసీ నిర్దేశించిన భూముల ధరలు ఎక్కువ. కానీ రేవంత్‌ ప్రభుత్వం ఎస్‌ఆర్‌ఓ ధరల్లో కేవలం 30 శాతం రేటు చెల్లించే వారికి భూములు కట్టబెడుతోంది. ఎస్‌ఆర్‌ఓ రేటునే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? హైదరాబాద్‌లో తక్కువగా ఉన్న ఎస్‌ఆర్‌ఓ ధరలు సవరిస్తామని చెప్పిన రేవంత్‌ ప్రభుత్వం, సవరణ చేయకముందే ఎవరి మేలు కో­సం హడావుడిగా ‘హిల్ట్‌ పి’అమలు చేస్తోంది. 

రూ.లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు రాకుండా ఎందుకు నష్టం చేస్తున్నారు? లే ఔట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) విషయంలో బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేసి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్‌.. పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లపై ఎస్‌ఆర్‌ఓపై అదనంగా 60 నుంచి 80 శాతం వసూలు చేసింది. అదే ‘హిల్ట్‌ పి’అమలుతో ల్యాండ్‌ కన్వర్షన్, చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ తదితరాల రూపంలో హెచ్‌ఎండీఏకు రూ.13,500 కోట్లు రాకుండా రేవంత్‌ ప్రభుత్వం చేస్తోంది. 

ఓఆర్‌ఆర్‌ లోపల మాత్రమే కాకుండా ఓఆర్‌ఆర్‌ చుట్టు పక్కల భూములు కూడా కొల్లగొట్టేలా పాలసీని తయారు చేసింది నిజం కాదా? ఎస్‌ఆర్‌ఓ ధరల్లో 30 శాతం వసూలు ద్వారా వచ్చే మొత్తంతో కొత్త పారిశ్రామిక వాడలు, క్లస్టర్లు అభివృద్ధి చేస్తారా? లేక బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారా? అనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి..’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. 

ఎనుముల సోదరుల జేబులు నింపేందుకే..     
‘ఎనుముల సోదరుల జేబులు నింపేందుకే సీఎం ‘హిల్ట్‌ పి’తెచ్చారు. ఆరు నెలల క్రితమే పాలసీని రూ­పొందించి అది బహిర్గతం కాకమునుపే రేవంత్‌రెడ్డి సోదరులు అగ్రిమెంట్లు చేసుకుని కమీషన్లు, వాటా­లు కూడా మాట్లాడుకున్నారు. విలువైన భూములు సగానికి సగం అనుముల బ్రదర్స్‌ చేతుల్లోకి వెళ్లిపో­యాయి. ఆ ఒప్పందాల వివరాలు త్వరలో బయట పెడతాం. 

గతంలో ఇలాంటి ప్రతిపాదన మేం తిరస్కరించాం. మంత్రి శ్రీధర్‌బాబు భూ కుంభకోణం పరిధిని తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని రూ.5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారో ఆయన చెప్పాలి. తిట్టినా, కేసులు పెట్టినా రేవంత్‌ను వదిలేది లేదు..’అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)